స్వీట్ ఆంటీ వాయిస్, నైస్ గా రూ. 41 లక్షలు స్వాహా, గొంతు ఎవరిది అంటే !

బెంగళూరు/రామనగర: ఓ యువకుడు కాలేజ్ లో చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాడు. సిటీకి వచ్చిన ఆ యువకుడు ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కంపెనీ ఇస్తున్న జీతం సరిపోకపోవడంతో విలాసంవతమైన జీవితం గడపడం అలవాటు చేసుకున్న ఆ యువకుడు వేసిన స్కెచ్ కు అందరూ హడలిపోయారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్న ఆ కేటుగాడు వేసిన స్కెచ్ కు పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని కుణిగల్ తాలుకాలోని కగ్గేరి ప్రాంతంలో నివాసం ఉంటున్న రవికుమార్ అలియాస్ కుమార్ అలియాస్ రవి (23) అనే యువకుడు కాలేజ్ పూర్తి అయిన తరువాత మంచి ఉద్యోగం చెయ్యాలని ఐటీ హబ్ చేరుకున్నాడు. తరువాత బెంగళూరులో కొంతకాలం నివాసం ఉన్న రవికుమార్ తరువాత బెంగళూరు శివార్లకు మకాం మార్చాడు.

 female voice

బెంగళూరులోని ఓ డేటాబేస్ కంపెనీలో రవికుమార్ ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం ఉద్యోగం చేస్తున్న రవికుమార్ కు కంపెనీ ఇస్తున్న జీతం సరిపోలేదు. తరువాత ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్న రవి సోషల్ మీడియాలో మగాళ్లు ఆడ గొంతుతో మాట్లాడటం ఎలా అని చూశాడు. ఇదే సమయంలో మగాళ్లు ఆడగొంతుతో మాట్లాడటానికి శిక్షణ ఇస్తాము అని బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ప్రకటన చూశాడు.

తరువాత ఆ సంస్థలో ఆడగొంతుతో ఎలా మాట్లాడాలి అని శిక్షణ తీసుకున్న రవికుమార్ అందులో ప్రావీణ్యం పొందాడు. అచ్చు ఆడగొంతుతో మాట్లాడటం అలవాటు చేసుకున్న రవికుమార్ తరువాత స్కెచ్ వేశాడు. ఫోన్ లో ఓ వ్యక్తిని లైన్ లో పెట్టిన రవి తరువాత అతన్ని చిన్నగా ముగ్గులోకి దింపాడు.

తన ప్రావీణ్యంతో అవతలి వ్యక్తికి సెక్స్ జోకులు వెయ్యడం, సెక్సీగా, రొమాన్స్ గా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇలా అతన్ని వలలో వేసుకున్న రవి తరువాత అసలు కథ మొదలు పెట్టాడు. మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, మా అమ్మకు బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స చేయించాలని అవతలి వ్యక్తికి చెప్పిన రవి కుమార్ అప్పుడప్పుడు డబ్బులు వసూలు చెయ్యడం మొదలు పెట్టాడు.

తరువాత అవతలి వ్యక్తికి ఫోన్ చేసి ఆడ గొంతుతో మాట్లాడిన రవి అతని నగ్న ఫోటోలు, వీడియో సంపాధించాడు. తరువాత నేను అడిగిన డబ్బు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు, పోటోలు ఎడిగింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి అతని నుంచి ఆరు నెలల్లో రూ. 41 లక్షలు వసూలు చేశాడు. ఇంత జరిగినా రవి నుంచి బెదిరింపు ఫోన్లు రావడం, ఇంకా డబ్బులు ఎక్కువ డిమాండ్ చెయ్యడంతో హడలిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 female voice

కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతకాలం ఆడ గొంతుతో మాట్లాడి బెదిరించి అడ్డంగా డబ్బులు వసూలు చేస్తున్న రవిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రవి ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేసి వాడుకున్నాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద మారుతున్న టెక్నాలజీతో ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నది ఆడా ?, మగా ? అని తెలీక పోవడంతో అమాయకులు ఇలా బలి అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+