Attorney General KK Venugopal : పదవీకాలం మరో ఏడాది పొడిగింపు-ఆ కే్సుల పెండింగ్ వల్లే
కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు మరో బంపర్ ఆఫర్ లభించింది. ఈ నెలాఖరుతో ముగుస్తున్న ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 12 నెలల పాటు ఆయన కీలక పదవిలో కొనసాగబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కీలక కేసులు వాదిస్తున్న న్యాయకోవిదుడు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగుస్తుండగా.. దాన్ని మరో 12 నెలల పాటు పొడిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం గతేడాదే ముగిసింది. కానీ కేంద్రం ఏడాది పొడిగింపు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.

89 ఏళ్ల కేకే వేణుగోపాల్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాక 2017లో ఆయన స్దానంలో నియమితులయ్యారు.
కీలక కేసులు పెండింగ్ లో ఉండటం, కేకే వేణుగోపాల్ పనితీరుపై కేంద్రం సంతృప్తిగా ఉండటంతో ఆయనకు మరోసారి పదవీకాలం పొడిగింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేకే వేణుగోపాల్ వాదిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన రిటైరైతే కీలక కేసులు మళ్లీ మొదటికొస్తాయని కేంద్రం భావించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications