అమ్మాయిపై ఢిల్లీలో డ్రైవర్ రేప్: హర్యానాలో పడేశాడు

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిన ఆటో డ్రైవరుపై కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత అమ్మాయిపై నిందితుడు ఢిల్లీలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను గుర్గావ్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టి పరారయ్యాడు. బాధిత అమ్మాయి అత్యాచారానికి గురైనట్లు వైద్య నివేదికలు వెల్లడించాయని పోలీసులు తెలిపారు.
కానీ, బాధిత అమ్మాయి ఇప్పటి వరకు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులను సంప్రదించి కేసుకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకుంటామని సబ్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications