ముఖేష్ అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రాతో పాటు అయోధ్యకు వెళుతున్న పారిశ్రామిక దిగ్గజాలు వీరే!!

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరియు విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశమంతా సిద్ధమవుతోంది. 22వ తేదీన అత్యంత విశిష్టంగా, అట్టహాసంగా, చారిత్రాత్మక ఘట్టంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి, దీనికి అనుబంధంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఘట్టాన్ని తిలకించేందుకు దేశంలోని హిందువులంతా ఎదురు చూస్తున్నారు.

దేశంలో చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ దిగ్గజాలు, రాజకీయవేత్తలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి తమవంతుగా విరాళాలు అందించి అయోధ్య రాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మొత్తం 150 దేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఎనిమిది వేల మంది ప్రముఖులు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలను అందుకున్న వారిలో ఉన్నారు.

Ayodhya ram mandir: Along with Mukesh Ambani, Adani.. these are the industrialists going to Ayodhya!!

ముఖ్యంగా పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాల విషయానికి వస్తే ముఖేష్ అంబానీ కుటుంబం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాన్ని అందుకుంది. ముఖేష్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాష్, అనంత్, కోడళ్ళు శుక్ల, రాధిక మర్చంట్ లతో అయోధ్యకు వెళుతున్నారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాదు గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, అజయ్ పిరమల్, ఆనంద్ మహీంద్రా తదితరులు వెళ్ళనున్నారు.

వీరు మాత్రమే కాదు లార్సెన్‌ అండ్‌ టూబ్రో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణియన్‌, ఆయన భార్య, వేదాంత గ్రూప్‌కు చెందిన నరేష్‌ ట్రెహాన్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చీఫ్‌ నవీన్‌ జిందాల్‌ తదితరులు వెళ్లనున్నారు.

అంతేకాదు జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయంకా, టిసిఎస్ సీఈవో కృతి వాసన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రస్తుత చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ నుండి కృష్ణ ఎల్లా, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్స్ చైర్మన్ దేవేందర్ రావు తదితరులు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. వీరంతా ఈనెల 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి, బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+