బురిడీ బాబా! దెయ్యం వదిలిస్తానంటూ.. ఆడపిల్లలపై ఆకృత్యాలు!
భువనేశ్వర్: దెయ్యాన్ని వదిలిస్తానని అంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో బురిడీ బాబా. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ నకిలీ బాబా పేరు బసంత్ కుమార్ బాగ్. ఒడిశాలోని నౌపడా జిల్లా ఖరియార్‌లో నివసిస్తున్నాడు. అతను ఓ స్వయం ప్రకటిత బాబా. తనకు మహిమలు ఉన్నాయని చెప్పుకొంటూ బాబాగా చలమాణి అవుతున్నాడు. ఖరియార్, చుట్టు పక్కల గ్రామాల్లో నిరక్షరాస్యులను టార్గెట్‌గా చేసుకుని వారిని దోచుకోవడం పనిగా పెట్టుకున్నాడు.
ఖరియార్ సమీపంలోని గ్రామానికి చెందిన దంపతులు అనారోగ్యానికి గురైన తమ కుమార్తెను బసంత్‌కుమార్ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ బాలికకు దెయ్యం పట్టిందని, దాన్ని విడిపిస్తానని నమ్మించాడు. సుమారు అయిదు వేల రూపాయలను వారి నుంచి వసూలు చేశాడు. బాలికను తన ఆశ్రమంలోనే వదిలి వెళ్లాలని సూచించడంతో వారు తమ కుమార్తెను అక్కడే వదిలి పెట్టి,తిరుగుముఖం పట్టారు. అదే అదనుగా బసంత్‌కుమార్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కొన్ని గంటల తరువాత ఆశ్రమానికి వచ్చిన బాధిత బాలిక తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకున్నారు. దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బసంత్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం బాలికను నౌపడాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications