బాబా రాందేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణలకు మళ్ళీ సుప్రీంకోర్టు అక్షింతలు; దిమ్మతిరిగే ప్రశ్నలు
బాబా రాందేవ్ ను, పతంజలి ఎండి బాలకృష్ణను సుప్రీంకోర్టు ధర్మాసనం వదిలిపెట్టడం లేదు. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు బాబా రాందేవ్ కు, పతంజలి ఎండి బాలకృష్ణకు మరో మారు అక్షింతలు వేసింది. కరోనాపై పోరాడేందుకు పతంజలి తయారుచేసిన ఆయుర్వేద ఔషధం కరోనిల్ ఔషధంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని సుప్రీంకోర్టు మరోమారు తప్పు పట్టింది.
క్షమాపణలు ప్రకటనల సైజులో ఇచ్చారా?
ఈ విషయంలో పతంజలి ఆయుర్వేదం బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక నేటి విచారణ నేపధ్యంలో నిన్న క్షమాపణల ప్రకటనలు వేసి, నేడు కోర్టుకు హాజరయ్యారు. పతంజలి తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేపర్లో పతంజలి క్షమాపణలు మీ కరోనిల్ ప్రకటనల సైజులో ఇచ్చారా అంటూ ప్రశ్నించింది.

నిన్ననే ఎందుకు ప్రకటనలు ఇచ్చారు? ఇంతకాల ఏం చేశారు?
అయితే క్షమాపణలు నిన్ననే ఎందుకు దాఖలు చేశారని ఇంతకుముందే చేసి ఉండాల్సింది కదా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అయితే క్షమాపణలు ప్రచురించడం కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, 67 వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చామని బాబా రాందేవ్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ మీరు ఇచ్చిన క్షమాపణలు ప్రకటన అందరికీ కనిపించేలా ప్రచురించారా అంటూ ప్రశ్నించారు.
క్షమాపణల ప్రకటనలు వేసిన పతంజలి
మీ మునుపటి ప్రకటనల ఫాంటు సైజు అదేనా అంటూ అడిగారు .అయితే పతంజలి వేసిన క్షమాపణల ప్రకటనలలో కోర్టు పట్ల తమకు చాలా గౌరవం ఉందని తప్పులు మళ్లీ పునరావృతం కావని స్పష్టం చేశారు. అయినప్పటికీ కోర్టు సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో అంతకు ముందు జరిగిన అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
క్షమించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకోలేదు
మిమ్మల్ని క్షమించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ కేసులో కోర్టులో రెండు చేతులు జోడించి బాబా రాందేవ్, పతంజలి ఎండి ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు చెప్పినప్పటికీ కోర్టు దానిని తిరస్కరించింది. ఇంకా వారిపైన కోర్టు సీరియస్ గానేఉంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications