ఉమర్ ఖాలిద్ బెయిల్ పై మాజీ సీజే సంచలనం-కీలక వ్యాఖ్యలు..!

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధి నేత ఉమర్ ఖాలిద్ ను ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టు చేసి ఐదేళ్లుగా బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచుతున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవే చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హయాంలోనూ ఉమర్ ఖాలిద్ జైల్లోనే ఉన్నప్పటికీ బెయిల్ పై విచారణ మాత్రం జరగలేదు. తాజాగా కోర్టు ఉమర్ ఖాలిద్ బెయిల్ ను తిరస్కరించింది. దీనిపై జైపూర్ సాహిత్య ఉత్సవంలో వీర్ సంఘ్వితో సంభాషణలో చంద్రచూడ్ మాట్లాడారు.

ఐదేళ్లుగా ఉమర్ ఖాలిద్ కు బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచుతున్న వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే న్యూయార్క్ మేయర్ మందానీ సైతం ఈ వ్యవహారంపై స్పందించి భారత అధికారులకు గతంలో లేఖ రాశారు. దీనిపై ఇవాళ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ ఏ నిందితుడికి అయినా బెయిల్ ఇవ్వడం అనేది ఓ నియమం కావాలన్నారు. కేవలం మూడు సందర్భాల్లో తప్ప బెయిల్ నిరాకరించకూడదనేది తన అభిప్రాయం అన్నారు.

Bail Should Be The Rule Former CJI Chandrachud on Speedy Trial for Umar Khalid

నిందితుడు నేరాన్ని పునరావృతం చేస్తే, దేశం నుండి పారిపోవచ్చు లేదా సాక్ష్యాలను తారుమారు చేయవచ్చనే అంశాలు ఉంటే తప్ప నిందితుడికి బెయిల్ పొందే అర్హత ఉంటుందని డీవై చంద్రచూడ్ తెలిపారు.బెయిల్‌ను శిక్షగా మార్చడం వల్ల న్యాయ వ్యవస్థపై స్వేచ్ఛ, నమ్మకం రెండూ క్షీణిస్తాయని ఆయన హెచ్చరించారు. తాను ప్రస్తావించిన ఈ సూత్రాలలో ప్రతి ఒక్కటి బెయిల్ దుర్వినియోగం కాకుండా చూసుకోవడానికి షరతులు విధించవచ్చనే వాస్తవాన్ని సూచిస్తుందన్నారు. అలాగే కోర్టులు నిందితుడి త్వరిత విచారణ హక్కును కూడా పరిగణించాలని సూచించారు.తాను కోర్టుల్ని విమర్శించడం లేదని, న్యాయమూర్తులు ప్రజల ఒత్తిడి లేదా గతాన్ని దృష్టిలో ఉంచుకుని కాకుండా, వారి ముందు ఉంచిన ఆధారాలు, సామగ్రి ఆధారంగా బెయిల్‌ను నిర్ణయించాలని చంద్రచూడ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+