Bakrid 2024: ఈ మేక ఖరీదు అక్షరాలా రూ.7.5 లక్షలు

Bakrid 2024 in Hyderabad: సోమవారం.. బక్రీద్ పండగ. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బక్రీద్ పండగ సందడి మొదలైంది. ఈద్ ఉల్ జుహా, బక్రీద్, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బైరామీ వంటి పేర్లతో ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. త్యాగానికి ప్రతీక భావిస్తారు ఈ పండగను. ఖుర్బానీ ఇవ్వడం దీని ప్రత్యేకత. మాంసాన్ని దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

హైదరాబాద్‌లో ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకుంటోన్నారు. అలాగే- మసీదులు, ఈద్గాలకు దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Bakrid 2024 A goat seller selling goats priced between Rs 50000 to Rs 7 5 lakhs

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి ముస్లింలు బారులు తీరుతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపు అవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డుస్థాయిలో పలుకుతున్నాయి. ఒక్కో మేక 50,000 నుంచి 7,50,000 లక్షల రూపాయల మేర ఉంటోంది. తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను ఏడు లక్షల రూపాయలకు విక్రయించినట్లు సయ్యద్ షాదబ్ అలీ తెలిపారు. దీని బరువు 155 కేజీలు.

అలాగే షాన్-ఎ- భోపాల్ అనే మరో మేకను నాలుగు లక్షల రూపాయలకు విక్రయించానని వెల్లడించారు. ముంబై, పూణె, నాగ్‌పూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్‌కోట్ వంటి నగరాలకు గొర్రెలు, మేకలను అమ్ముతుంటానని అన్నారు. సాధారణ రోజుల కంటే బక్రీద్ నాడు వాటికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు.

ఇప్పుడు మరో మేకను 7,50,000 రూపాయలకు అమ్మకానికి ఉంచినట్లు వెల్లడించారు సయ్యద్. గొర్రెలు, మేకలను కొనుగోలు చేసి, బక్రీద్ నాడు వాటిని బలి ఇచ్చి, మాంసాన్ని పేదలకు దానం చేయడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తుంటామని, అందుకే ఈ పండగనాడు వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+