వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నుపుర్ తల తీసుకురండి.. ఇల్లు, ఆస్తి ఇచ్చేస్తా.. సల్మాన్ చీస్తి వీడియో

|
Google Oneindia TeluguNews

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై ప్రవక్త కామెంట్లు నీడలా వెంటాడుతున్నాయి. రోజు ఎవరో ఒకరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఆమె కామెంట్ల వల్లే అల్లర్లు, అశాంతి, ఒకరి హత్య జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆమె వల్లే ఇలా జరిగిందని కామెంట్ చేసింది. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే నుపుర్ శర్మకు మరొ వ్యక్తి బెదిరించాడు. అంటే ఆమెను కాదు.. ఆమె తల తీసుకువస్తే తన యావద ఆస్తిని ఇచ్చేస్తానని తెలిపాడు.

తల తీసుకురండి..

తల తీసుకురండి..

నుపుర్ శర్మ తల తీసుకురావాలని సదరు వ్యక్తి కోరాడు. ఈ మేరకు వీడియో తీసి.. పంపించాడు. రాజస్థాన్‌లో గల అజ్మీర్‌కు చెందిన వ్యక్తి ఈ ఆఫర్ ఇచ్చాడు. తనకు నుపుర్ తల ఇస్తే.. ఇల్లు, ఆస్తిని ఇస్తానని వివరించారు. వీడియోలో చెప్పిన వ్యక్తిని సల్మాన్ చీస్తిగా గుర్తించారు. అతని వీడియోను చూశామని.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

హత్యకు గురవుతున్నారు

హత్యకు గురవుతున్నారు

దేశంలోని ముస్లింలు అందరూ హింసకు గురవుతున్నారని సల్మాన్ వివరించారు. హత్యకు కూడా గురవుతున్నారని తెలిపారు. దేశంలో ద్వేషం పెరగడానికి కారణం నుపుర్ శర్మ అని తెలిపారు. తాను కూడా ఈ వీడియో చూశానని ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. సల్మాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో అతను మత్తులో ఉన్నాడని వివరించారు. ఈ విషయమై దర్గా, అంజుమన్‌తో పోలీసులు మాట్లాడారు. వీడియో వైరల్ కాకుండా చూడాలని కోరారు. కానీ ఇప్పటికే అదీ సోషల్ మీడియాలో తిరుగుతుంది.

టైలర్ హత్య

టైలర్ హత్య

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఇద్దరు ఓ టైలర్‌ తల నరికిన సంగతి తెలిసిందే. ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుగుతుంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ ఆ టైలర్ పోస్ట్ చేశారు. అతనిని చంపిన తర్వాత ప్రధాని మోడీకి కూడా ఇదే గతి పడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జ్ఞాన్ వ్యాపి మసీదుకు సంబంధించి చర్చ జరిగింది. టీవీ డిబేట్‌లో నుపూర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై తప్పుగా మాట్లాడారు. దీంతో వివాదం చెలరేగింది.

English summary
man from Rajasthan’s Ajmer announced give away house and property as reward to anyone who decapitates suspended BJP spokesperson Nupur Sharma for her controversial remarks on Prophet Mohammad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X