Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!

బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ నటి బిగ్‌బాస్ ఫేమ్ జయశ్రీ రామయ్య బెంగళూరులోని ఓ వృద్ధాశ్రమంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బెంగళూరులోని జనప్రియ టౌన్‌షిప్‌లో ఉన్న సంధ్య కిరాణా అనే వృద్ధాశ్రమంలో ఆమె నివసిస్తోంది. అయితే సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక నివేదికను బట్టి తెలుస్తోంది.

జయశ్రీ కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. గతేడాది జూలైలోనే ఆమె తన ఫేస్‌బుక్‌ పేజ్ పై డ్రిపెషన్‌తో కూడిన పోస్టులు పెట్టింది. అయితే ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది కూడా. ఆ తర్వాత తాను క్షేమంగానే ఉన్నట్లు మరో పోస్టు చేసింది. గత కొన్ని నెలలలుగా జయశ్రీ రామయ్య కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితుల నుంచి దూరంగా ఉంటోందని ఒంటరిగా ఉంటోందని ఆమె స్నేహితురాలు శిల్పా చెప్పింది. అంతేకాదు వారు ఫోన్లు చేసిన, మెసేజ్‌లు పెట్టినా జయశ్రీ స్పందించడం లేదని వివరించింది. కన్నడ బిగ్‌బాస్ సీజన్ 3లో జయశ్రీ కంటెస్టెంట్‌గా ఉన్నింది.

Bengaluru:Kannada Bigg Boss contestant Jayashree Ramaiah found dead in old age home

ఇక గతంలో జయశ్రీ ఫేస్‌బుక్ పోస్టు చేయగానే కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆమెను ఆశ్రయించి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత జయశ్రీ ఫేస్‌బుక్ లైవ్‌లో వచ్చి మాట్లాడింది. ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడం లేదని స్పష్టం చేసింది. సుదీప్ నుంచి తాను ఆర్థికపరమైన సహాయం కూడా కోరడం లేదని వివరించింది. మానసికంగా కృంగిపోయి ఉన్నానని ఈ డిప్రెషన్ నుంచి బయట పడలేకపోతున్నందునే మరణాన్ని కోరుకుంటున్నట్లు జయశ్రీ రామయ్య చెప్పింది. ఆర్థికంగా తాను బలంగా ఉన్నట్లు చెప్పిన జయశ్రీ డిప్రెషన్‌ నుంచి మాత్రం బయట పడలేక ఉన్నానని చెప్పుకొచ్చింది.

Bengaluru:Kannada Bigg Boss contestant Jayashree Ramaiah found dead in old age home

అయితే ఈ ఫేస్‌బుక్ లైవ్ వీడియోను కూడా డిలీట్ చేసిన జయశ్రీ... సుదీప్‌కు ధన్యవాదాలు చెప్పింది. తనను పలకరించి తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. తన అభిమానులను కంగారు పడేలా చేసినందుకు క్షమించాల్సిందిగా అభిమానులను కోరింది. డిప్రెషన్ నుంచి బయటపడ్డట్లు కూడా చెప్పుకొచ్చింది. ఒల్లెడల్లప్పొ అనే చిత్రంలో జయశ్రీ నటించింది. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+