actress: నటి అని రెచ్చిపోయింది ?, మేడమ్ అరెస్టుకు లుక్ ఔట్ నోటీసులు జారీ, దెబ్బకు ?
బెంగళూరు/చెన్నై: వరకట్న వేధింపుల కేసులో నటి అభినయా మీద ఆమె వదిన వరలక్ష్మి కేసు పెట్టడంతో కేసు విచారించిన కోర్టు నటి అభినయా కుటుంబానికి జైలు శిక్ష విధించింది. అయితే పోలీసులకు చిక్కకుండా దాక్కుని తిరుగుతున్న నటి అభినయా కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
తన ఇంట్లో తనను వేధిస్తున్నారని నటి అభినయా ఆమె వదిన పోలీస్ స్టేషన్ కేసు పెట్టి చివరికి హైకోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులో నటి అభినయాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

నటి ఇంట్లో వ్యభిచారం ?
నటి అభినయా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ్యడంతో ఈకేసు కోర్టు వరకు వెళ్లి విచారణ కూడా జరిగింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు నిందితులకు శిక్షను ఖరారు చేసింది. ఆ తరువాత సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నటి అభినయా, ఆమె సోదరుడు, ఆమె తల్లి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో విచారణ
అయితే కర్ణాటక హైకోర్టులో సెషన్స్ కోర్టు ఆదేశాలను సమర్థించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితురాలు నటి అభినయతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు నటి అభినయా, ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల జాడ తెలియకుండా పరారీలో ఉన్నారు. దీంతో నటి అభినయ, ఆమెతల్లి జయమ్మ, సోదరుడు చెలువరాజు కోసం చంద్రా లేఅవుట్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుల గురించి సమాచారం అందితే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నటి సోదరుడి భార్య రివర్స్ అయితే ?
వరకట్న వేధింపుల కేసులో శ్యాండిల్ వుడ్ నటి అభినయాకు జైలు శిక్ష పడింది. తన అన్న శ్రీనివాస్ భార్య లక్ష్మీదేవిని వేధించారన్న ఆరోపణలపై ఆమెకు జైలు శిక్ష పడింది. నటి అభినయాకు హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అభినయా అన్నయ్య శ్రీనివాస్, లక్ష్మీదేవి 1998లో పెళ్లి చేసుకున్నారు.

అవసరమా మేడమ్ ?
2002లో అభినయా కుటుంబం పెళ్లి సమయంలో పదే పదే కట్నం తేవాలని ఒత్తిడి తెచ్చారని కోడలు లక్ష్మీదేవి ఫిర్యాదు చేసింది. 2012లో మేజిస్ట్రేట్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. అనంతరం నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పును ప్రకటించి నిందితులకు శిక్షను ఖరారు చెయ్యడంతో సిటీ నటి అభినయాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మాయం అయ్యారు.












Click it and Unblock the Notifications