ప్రియుడికి తల్లి, పిన్ని ప్రైవేట్ ఫోటోలను పంపిన కూతురు.. ఎక్కడంటే..?
ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులనే హతమార్చిన కుమార్తెల ఘటనలు మనం చూశాం. అదే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనూ కాటికి పంపిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే బెంగళూరులో ఇలాంటి షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడి మోజులో పడింది. తానేం చేస్తోందనే ఇంగితం కూడా మరిచింది. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిపై దారుణానికి ఒడిగట్టింది. కూతురి ఉన్నత చదువుల కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన ఆ తల్లిపైనే వికృతంగా ఆలోచించింది. ఆ స్మార్ట్ ఫోన్ లో తల్లి, పిన్ని ప్రైవేట్ వీడియోలను ఆ యువతి తన ప్రియుడికి పంపించింది. కానీ ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయింది.
బెంగళూరులో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మాయలో పడిపోయిన ఓ యువతి ఏకంగా తన తల్లి, పిన్ని నగ్న ఫోటోలను ప్రియుడికి పంపింది. అలా కన్న తల్లి ప్రైవేట్ ఫోటోలను తన ప్రియుడికి రహస్యంగా పంపుతూ అడ్డంగా దొరికిపోయింది. కూతురు ప్రవర్తనకు కంగుతిన్న ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..?
బెంగళూరు నగరంలోని మైసూర్ రోడ్ లో గత 25 సంవత్సరాలుగా నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు (23) బీబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఉద్యోగాల కోసం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతుంది. చిన్న కూతురు ఇంకా చదువుతోంది. తండ్రి వంటమనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక తల్లి గృహిణిగా ఉంది. అయితే ఉన్నత చదువులు, జాబ్స్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలని కోరడంతో తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు.
అయితే మొబైల్ వచ్చిన తర్వాత బాధిత యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించారు. నిత్యం వాట్సాప్ లో చాట్ చేయడం.. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడటం తల్లిదండ్రులు గమనించారు. అలాగే ఓ రోజు ఇంటి పని చేసుకుంటున్న తల్లి తన కుమార్తె గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె వేరే వ్యక్తితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నట్లు తల్లి గుర్తించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకుంది.

అయితే కూతురు ప్రవర్తన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆ ఫోన్ అన్ లాక్ చేసి చూశారు. అందులో ఉన్న కంటెంట్ చూసి వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అందులో ఆ యువతి తల్లితో పాటు తల్లి సోదరి నగ్న చిత్రాలు, వీడియోలను గుర్తించారు. వారు ఇంట్లో స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించి తన ప్రియుడికి పంపించింది. దాంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆ తల్లిదండ్రులు చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications