వైరల్ వీడియో: డ్రైవర్ లెస్ కారు వచ్చేస్తోంది.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో..
డ్రైవర్ లెస్ కారు వైరిన్( విప్రో- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్ వర్క్) అండ్ ఆర్ వీ ఇంజినీరింగ్ ను బెంగళూరులో తాజాగా ఆవిష్కరించారు. ఆదార్ష్ హెగ్డే అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన 28 సెకన్ల వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ డ్రైవర్ లెస్ కారులో ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ కారును పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించడం విశేషం.
ఈ డ్రైవర్ లెస్ కారును ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc).. ఆర్ వీ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు, విప్రో సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా డ్రైవర్ లెస్ కారును రూపొందించారు. ఈ కారు ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ విచ్చేశారు. ఆర్ వీ కాలేజీ క్యాంపస్ గ్రౌండ్స్ లో ఈ డ్రైవర్ లెస్ కారు చక్కర్లు కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ కారు విశేషాలను.. దీని వెనకున్న శాస్త్రవేత్తల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ వీడియోలో కారు డ్రైవర్ లేకుండా ఆటోమేటిక్ గా ప్రయాణిస్తోంది. త్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ ఈ కారులో ప్రయాణించారు. ఆర్ వీ కాలేజీ గ్రౌండ్స్ లోనే షార్ట్ రైడ్ వేశారు. అయితే సన్నిహిత వర్గాల ప్రకారం.. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు అభివృద్ధి దశలోనే ఉంది. రానున్న నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారత్ రోడ్డు పరిస్థితులపై పూర్తిస్థాయిలో స్టడీ జరుగుతోంది. భారత రోడ్లపై ఈ కారు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ డ్రైవర్ లెస్ కారును 6 ఏళ్ల పాటు శ్రమించి AI, ML, 5G -ఆధారిత V2X కమ్యూనికేషన్ ను వినియోగించి తయారు చేశారు.
🚨 India’s first driverless car has been unveiled by IISc, Wipro, and RV College in Bengaluru. pic.twitter.com/AlnNvnAPkc
— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2025
ఈ డ్రైవర్ లెస్ కారును ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc).. ఆర్ వీ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు, విప్రో సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తి స్థాయిలో స్వదేశీ టెక్నాలజీతోనే ఈ కారు నిర్మితమవుతోంది. ఈ డ్రైవర్ లెస్ కారు ట్రయల్ రన్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications