ఆ ముస్లిం దేశాధినేత కోసం మోడీ ప్రోటోకాల్ బ్రేక్..! ఎయిర్ పోర్టుకెళ్లి, కౌగిలింతలతో..!
ప్రధాని మోడీ ఇవాళ ఓ అరుదైన పని చేశారు. ఓ ముస్లిం దేశాధినేత భారత దేశానికి కేవలం రెండు గంటల పర్యటనకు వచ్చారు. దీంతో ఆయన్ను కలిసేందుకు తనకు ఉన్న సాధారణ ప్రోటోకాల్ ను సైతం పక్కనబెట్టేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ ఆయన్ను రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఏకంగా కౌగిలించుకుని మరీ స్వాగతం పలికారు. ఈ ఘటనతో సదరు దేశాధినేత సైతం ఉబ్బితబిబయ్యారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాధినేత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇవాళ దాదాపు రెండు గంటల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. దీంతో మన ప్రధానమంత్రి మోడీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం ఇద్దరు నేతలు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. భారతదేశం-యుఏఈ మధ్య సంబంధాలను ఇది మరోసారి గుర్తుచేసింది. ఇది కేవలం రెండు గంటల టూరే అయినా.. దౌత్యపరంగా భారత్ కు కీలకమైంది. రక్షణ, వాణిజ్యం, ఇంధనం మరియు ప్రాంతీయ భద్రతలో రెండు దేశాల మధ్య సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది.

దీంతో ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడి పర్యటనను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. "నా సోదరుడు, యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్ళాను. ఆయన పర్యటన బలమైన భారతదేశం-యుఎఇ స్నేహానికి ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతను వివరిస్తుంది. మా చర్చల కోసం ఎదురు చూస్తున్నాను" అని మోడీ యూఏఈ అధినేతను ట్యాగ్ చేస్తూ రాశారు.

Went to the airport to welcome my brother, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE. His visit illustrates the importance he attaches to a strong India-UAE friendship. Looking forward to our discussions.@MohamedBinZayed pic.twitter.com/Os3FRvVrBc
— Narendra Modi (@narendramodi) January 19, 2026
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారతదేశానికి అధికారిక పర్యటనలో భాగంగా వచ్చారు. ఇది యూఏఈ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారత్ కు రావడం ఇది మూడోసారి. గత దశాబ్దంలో ఇది ఆయన ఐదో టూర్. భారత్, యూఏఈ రాజకీయ అవగాహన, సాంస్కృతిక సంబంధాలు, పెరుగుతున్న ఆర్థిక సహకారంలో సన్నిహిత, బహుముఖ సంబంధాలకు ఇది గుర్తుగా జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, స్థానిక కరెన్సీ పరిష్కార వ్యవస్థ, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం వంటి అంశాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి. యూఈఏ భారతదేశానికి కీలకమైన వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములలో ఒకటిగా కొనసాగుతోంది.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications