భారత్ కు భారీ షాక్-ఇజ్రాయెల్ కు గూఢచర్యం-8 మంది మాజీ నేవీ ఆఫీసర్లకు ఖతార్ ఉరిశిక్ష?

ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తూ దొరికిన ఎనిమిది మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్ ఇవాళ మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే ఇజ్రాయెల్-హమాస్ యుద్దంలో తొలుత ఇజ్రాయెల్ కు ఏకపక్షంగా మద్దతు ప్రకటించి దెబ్బతిన్న భారత్.. ఆ తర్వాత నాలిక కరుచుకుని పాలస్తీనాపై తమకు సానుభూతి ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కు అనుకూలంగా గూఢచర్యం వ్యవహారం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం గల్ఫ్ దేశమైన ఖతార్ నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులకు ఖతార్ కోర్టు అక్టోబర్ 26న మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపింది. దీనిపై వివరణాత్మక తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించింది. ఖతార్ లోని అల్ దహ్రా కంపెనీకి చెందిన 8 మంది భారతీయ ఉద్యోగులకు సంబంధించిన కేసులో ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ ఈ రోజు తీర్పును వెలువరించినట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని విదేశాంగశాఖ తెలిపింది.

big setback to india as qatar impose death penalty to eight ex-navy officials for spying for israel

తమ నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారుల కోసం ఖతార్ న్యాయ ప్రక్రియలో భారతదేశం జోక్యం చేసుకోదని విదేశాంగశాఖ తెలిపింది. అయితే మరణశిక్ష తీర్పుతో తాము తీవ్రంగా షాక్ అయినట్లు అధికారులు తెలిపారు.అయితే వీరి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని తెలిపారు. దీని కోసం న్యాయపరమైన అన్ని అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసు విషయంలో ఖతార్ ప్రభుత్వంతో పాటు అక్కడి భారత ఎంబసీతో నిత్యం టచ్ లో ఉంటూ చట్టపరమైన సాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేసిన విషయంలో మరిన్ని వివరాలు బయటపెట్టేందుకు అధికారులు ఇష్టపడటం లేదు. అయితే ఖతార్ మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారుల్లో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌ ఉన్నారు.

ఈ ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గతేడాది ఆగస్టు 30న దోహా లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారిపై నమోదు చేసిన అభియోగాల్ని మాత్రం ఖతార్ అధికారులు వెల్లడించలేదు. దీంతో భారత్ ఈ వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవి అందిన తర్వాత దీనిపై మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+