ఢిల్లీలో ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. యమునా నది ఇష్యూలో ఝలక్
దేశ రాజధాని హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో.. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై హర్యానాలో కేసు నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కేజ్రీవాల్ యమునా నదిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.
ఈ క్రమంలోనే షాబాద్ కు చెందిన జగన మోహన్ అనే లాయర్ మాజీ సీఎంపై కురుక్షేత్ర పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ 192, 196 (1) సహా పలు సెక్షన్ల కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే ప్రధాని మోడీ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ స్పందించి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. కేజ్రీవాల్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. నయాబ్ సింగ్ యమునా నీటిని తాగి కేజ్రీవాల్ కు కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మోహానియాపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దినేష్ ఓ మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దినేష్ మోహానియా సంగం విహార్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు విజయం సాధించారు. గత ఏడాది కూడా సంగం విహార్ నియోజకవర్గంలోని.. రోడ్డు పక్కన ఉన్న పండ్ల వ్యాపారితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. ఆ సమయంలో కూడా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యి పోలీసులు కేసు నమోదు చేశారు. వరుస ఘటనల నేపధ్యంలో ఎమ్మెల్యే ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని నెటిజన్లు, ప్రజలు హితవు పలుకుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications