Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూతురే విలన్, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రిని..అవయవాలు బ్యాగుల్లో కుక్కి...

లోకం పోకడే, సమాజం తీరే తెలియడం లేదు. మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. కొందరు వావి, వరస మరచిపోతున్నారు. వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనల్లో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అలా ముంబైలో కూడా ఓ కూతురు తండ్రినే హతమార్చింది. అవును తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మట్టుబెట్టింది. అంతేకాదు అవయవాలను ముక్కలు ముక్కలుగా నరికింది.

దత్తత తీసుకుంటే

దత్తత తీసుకుంటే

ముంబైలోని వకోలాలో గల ద్వారాక కుంజ్‌లో బెన్నెట్ రెబెల్లో నివసిస్తున్నారు. ఇతని వయస్సు 59 సంవత్సరాలు కాగా.. రెండుసార్లు పెళ్లైంది. కానీ వారితో విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు. ఒక్కడినే ఉంటున్నానని భావించి రెండేళ్ల క్రితం కుమారి ఆరాధ్య జితేంద్ర పాటిల్ ఆలియాస్ రియా (19)ను దత్తత తీసుకున్నారు. వీరిద్దరూ తండ్రి కూతురి మాదిరిగానే ఉన్నారు. కానీ అప్పుడే సీన్‌లోని ఆమె బాయ్‌ప్రెండ్ ఎంటరయ్యాడు. అతను ఆమె కంటే మూడేళ్లు చిన్నవాడు.. అంటే మైనర్ కావడం విశేషం.

సీన్‌లోకి బాయ్‌ఫ్రెండ్

సీన్‌లోకి బాయ్‌ఫ్రెండ్

బెన్నెట్ రెబెల్లో గిటారిస్ట్‌గా పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఘట్‌కోపర్‌లో గల అసల్పాకు చెందిన రియాను చూశాడు. ఆమెను దత్తత తీసుకోవాలని భావించి.. తీసుకున్నాడు. కానీ అక్కడే ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయం మాత్రం బెన్నెట్ గుర్తించలేదు. తర్వాత తన వద్దకు తీసుకొచ్చిన తర్వాత వారిద్దరూ కలుసుకోవడం చూసి అంగీకరించలేదు. ప్రేమ వద్దని చెప్పడంతో రియాకే కాదు ఆమె లవర్‌కు కూడా నచ్చలేదు. దీంతో వారి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.

లైంగిక వేధింపులు..

లైంగిక వేధింపులు..

అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ నెలకొంది. తమ ప్రేమ అంటే గిట్టని బెన్నెట్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని రియా ఆరోపించారు. వేధింపులు తాళలేక మట్టుబెట్టాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపారు. దీంతో బెన్నెట్‌లో మరో కోణం ఉందా అనే అంశం చర్చకొచ్చింది. వారి మధ్య వివాదం ఉండటంతో.. బెన్నెట్‌ను ఎలాగైన మట్టుబెట్టాలని రియా, లవర్ ప్రణాళిక రచించారు.

27వ తేదీన ఘటన

27వ తేదీన ఘటన

గతనెల 27వ తేదీని వారిద్దరూ కలిసి బెన్నెట్‌పై దాడి చేశారు. వెదురు కర్రతో దాడి చేశారు. తర్వాత దొమల స్ప్రే ప్రయోగించారు. బెన్నెట్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. సూట్ సహా మరో రెండు బ్యాగుల్లో శరీర భాగాలను కుక్కారు. బెన్నెట్ సున్నితమైన ప్రాంతాలను కూడా కోసి.. ధ్వంసం చేశారు. మితి నదిలో కాలు, చేయి, సున్నిత ప్రాంతానికి సంబంధించి భాగాలు పడేశారు. మిగతా రెండు బ్యాగులను కూడా మూడురోజుల్లో పడేశారు.

పట్టించిన స్వెటర్

పట్టించిన స్వెటర్

మితి నదిలో సూట్ కేసు లభించింది. అందులో కాలు, చేయి, సున్నితమైన ప్రాంత అవయవాలు ఉన్నాయి. కానీ కేసు దర్యాప్తునకు కీలక క్లూను రియా, అతని ఫ్రెండ్ ఇచ్చారు. సూట్‌కేసును ఓ స్వెటర్‌లో చుట్టి పడేశారు. ఆ స్వెటర్ మీద అల్మో మెన్స్ వేర్ అని ఉంది. స్వెటర్ ఎవరికీ కుట్టారు అని ఆరాతీస్తే బెన్నెట్ పేరు బయటపడింది. అలా విచారణ ముందుకుసాగింది. తర్వాత సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో కూడా బెన్నెట్ వివరాలను సెర్చ్ చేశారు. అక్కడ కూడా మెరున్ కలర్ స్వెటర్ వేసుకొని బెన్నెట్ ఫోటో కనిపించింది. అందులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఇంటికి చేరుకున్నారు.

ఇంటికొస్తే తాళం..

ఇంటికొస్తే తాళం..

ఇంటికొచ్చిన పోలీసులకు తాళం కనిపించింది. ఎవరూ లేరా అని పోలీసులు అడిగితే.. బెన్నెట్ గిటారిస్ట్ అని అప్పుడప్పుడూ కొద్దిరోజుల వరకు రారని పేర్కొన్నారు. గత 10 రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పారు. ఘటన గురించి రియాను ప్రశ్నిస్తే.. విచారణలో నేరం అంగీకరించారు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. కానీ తనను లైంగికంగా వేధించడంతో హతమార్చామని చెప్పారు. అంతేకాదు తాము సన్నిహితంగా ఉండటాన్ని ఓర్వలేకపోయాడని వెల్లడించారు.

రెండు బ్యాగులు ఎక్కడ..?

రెండు బ్యాగులు ఎక్కడ..?

బెన్నెట్ శరీర భాగాలు ఉన్న మిగతా రెండు బ్యాగుల కోసం పోలీసులు తనిఖీ చేపడుతున్నారు. ఐదుగురు సభ్యుల గల క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును చేధించారు. శరీర భాగాలను వెలికితీసి.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఏం జరిగిందనే అంశాన్ని నిర్ధారిస్తామని పోలీసులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+