మోదీ మీద మాజీ సీఎం తిరుగుబాటు ? రివర్స్ గేర్ వేస్తున్న సిట్టింగ్ సీఎం, ఏం జరుగుతుందో ?

బీజేపీ టికెట్‌ ఆశించిన బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ బీజేపీ హైకమాండ్ నాయకుల మీద రగిలిపోతున్నారు. బీజేపీ పెద్దలు చేసిన రాజీ ప్రయత్నాల తరువాత కూడా మాజీ సీఎం సదానంద గౌడ చల్లారినట్లు కనిపించడం లేదు. మాజీ సీఎం సదానంద గౌడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని కర్ణాటక ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

బీజేపీ హైకమాండ్ కూడా మాజీ సీఎం సదానంద గౌడను బుజ్జగించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం సదానంద గౌడ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కానీ సదానంద గౌడ కాంగ్రెస్ చేయ్యి పట్టుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మాజీ సీఎం సదానంద గౌడ కాంగ్రెస్‌లో చేరే విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

BJP high command s talks with former CM Sadananda Gowda failed

మాజీ సీఎం సదానంద గౌడ కాంగ్రెస్ పార్టీలో చేరికపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బెంగళూరు నార్త్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ కూడా లోక్‌సభ ఎన్నికల టికెట్ విషయంలో బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇవ్వడంతో ఇద్దరు నాయకులు కలత చెందారని అందరికి తెలిసిందే.

BJP high command s talks with former CM Sadananda Gowda failed

మంగళవారం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇప్పటికే మాజీ సీఎం సదానంద గౌడ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ నేతలు నన్ను సంప్రదించిన మాట వాస్తవమే అని, దీనిపై మా కుటుంబసభ్యులతో చర్చించి మంగళవారం తుది నిర్ణయం తీసుకుంటానని సదానంద గౌడ తెలిపారు. బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి సదానంద గౌడకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

BJP high command s talks with former CM Sadananda Gowda failed

అయితే ఈ విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. మరోవైపు మైసూరు లోక్‌సభ స్థానం టికెట్‌ను సదానంద గౌడకు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే మైసూరు నియోజకవర్గం టికెట్లు మాజీ సీఎం సదానంద గౌడకు ఇచ్చేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చెబుతుంది ?, మాజీ సీఎం సదానంద గౌడ రూటు ఎటువైపు అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+