హిందువులు అంటే సమాజం అంటే బెవర్సా సమాజమా ?, సీఎంకు ఫైర్ బ్రాండ్ ఎంపీ సవాల్ !


లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు సమయం ఉన్నా కర్ణాటకలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఏకవచనంతో విమర్శనాస్త్రాలు సంధించిన బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశ సంస్కృతి, హిందూ సంప్రధాయాల గురించి మాట్లాడే సిద్దరామయ్య మీద బీజేపీ ఎంపీ విరుచుకుపడ్డారు.

సీఎం సిద్దరామయ్య తన ముందుకు వచ్చి భారతదేశ సంస్కృతి, హిందూ సంప్రధాయాల విషయంలో బహిరంగంగా చర్చించాలని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే డిమాండ్ చేశారు. హిందూ సమాజం అంటే బెవర్సా సమాజం కాదనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్ నాయకుల మీద మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

BJP MP Anant Kumar Hegde has warned Congress leaders that they will not tolerate criticism of Hindu society,
కేజీఎఫ్, పుష్పా, కాంతార సినిమాల రికార్డులు బ్రేక్ చేసిన హనుమాన్, అదే జరిగితే ఈనెలలో ఊస్ట్!

హిందూ సంస్కృతి గురించి మాట్లాడే సిద్దరామయ్య హిందూ సమాజం అంటే బెవర్సా సమాజం అనుకుంటున్నారా ?, 20% ఓట్ల కోసం హిందువులను ఇంత చులకనగా మాట్లాడుతున్నారు?, 80% నుంచి 85% ఉన్న హిందూ సమాజంపై మీకు గౌరవం లేదా ? అని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై మండిపడ్డారు. భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడే సిద్ధరామయ్య నాముందుకు రావాలని, లైవ్ డిబేట్ కు సిద్దం కావాలని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెడ్డే కర్ణాటక సీఎంకు సవాలు విసిరారు.

కర్ణాటక ప్రజలకు వీళ్ల విషయం తెలియాలంటే సీఎం సిద్దరామయ్య తనతో చర్చకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు. తాను నాలుగున్నరేళ్లుగా ఎక్కడున్నాను అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారని, తనను కుంభకర్ణుడితో పోల్చుతూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించిందని, వాటన్నిటికీ రాబోయే రోజుల్లో సమాధానం చెబుతానని, మీరు మాట్లాడిన మాటలు అన్నింటికీ సమాధానం ఇస్తానని, మీరు మాట్లాడిన అన్ని మాటలకు వడ్డీతో సహా చెల్లిస్తానని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని సామూహిక హంతకుడు అని ఏకవచనంతో అభివర్ణించారని, ప్రధాని మోదీ విషయంలో సిద్ధరామయ్యకు, కాంగ్రెస్‌కు లేని మర్యాద బీజేపీకి ఎందుకు ఉండాలని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. నా ప్రధాని, నా దేశం, నా మతం గురించి మీరు మాట్లాడితే నేను సహించనని బీజేపీ ఎంపీ అన్నారు.

BJP MP Anant Kumar Hegde has warned Congress leaders that they will not tolerate criticism of Hindu society,

గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకులు ఏలా మాట్లాడారు అని అనంత్ కుమార్ హెగ్డే గుర్తు చేశారు. ప్రధాని మోదీని రావణుడు అని దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారని, జయరామ్ రమేష్ అయితే మోదీని భస్మాసుర అని అన్నారని, మణిశంకర్ అయ్యర్ అయితే మోదీని విషసర్పం అని పిలిచారని, వాటి గురించి మాట్లాడకుండా తాను సీఎం సిద్దరామయ్యను ఏకవచనంతో మాట్లాడానని పెద్ద రాద్దాంతం చేస్తున్నారని, కాంగ్రెస్ కు ఒక న్యాయం, తనకో న్యాయమా అంటూ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+