వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు పీఎం మోడీ రోడ్ షోతో ప్రారంభం; ఈసారి టార్గెట్ అదే!!

|
Google Oneindia TeluguNews

నేటి నుండి రెండు రోజులపాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఇతర అగ్ర నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లతో పాటు ఇతర సీనియర్ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దాదాపు 350 మంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో నేడు, రేపు పాల్గొననున్నారు.

జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపుకు అవకాశం

జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపుకు అవకాశం

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ, ఆర్థిక మరియు విదేశాంగ విధాన సమస్యలపై పార్టీ విధానాలకు సంబంధించి మూడు, నాలుగు తీర్మానాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సమావేశానికి ముందు అమిత్ షా మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022లో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారన్న సందేశాన్ని పంపాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, ప్రధాన నరేంద్ర మోడీని ప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన వారికి గుజరాత్ ప్రజలు సమాధానం చెప్పారని అమిత్ షా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని ఈ సందర్భంగా అమిత్ షా పరోక్షంగా టార్గెట్ చేశారు.

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు

బీజేపీ నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలకమైన రాజకీయ నిర్ణయాలు ఉండనున్నాయి. 2024లో ప్రధాన నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలన్న దానిపై సమావేశం సమీక్షిస్తుంది. వచ్చే ఎన్నికల సన్నాహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 2022 జూలై నెలలో హైదరాబాద్లో జరిగిన చివరి జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పనుల అమలను కూడా సమీక్షించనున్నారు.

నేడు ఢిల్లీలో రోడ్ షో.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి తొమ్మిదేళ్ళు

నేడు ఢిల్లీలో రోడ్ షో.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి తొమ్మిదేళ్ళు

జనవరి 16వ తేదీన ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు జరిగి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ కళాకారుల సంస్కృతిక ప్రదర్శనలతో బిజెపి రోడ్ షో నిర్వహిస్తోంది. ఇక ఇదే రోజు బిజెపి రాష్ట్రాలకు సంబంధించిన యూనిట్ల ప్రగతి నివేదికను సమర్పించే జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించనుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పటేల్ చౌక్ నుండి ఎన్డీఎంసీ సమావేశ వేదిక వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతో సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు.

 జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మెయిన్ ఫోకస్ ఇదే

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మెయిన్ ఫోకస్ ఇదే

ఇదిలా ఉంటే 2023లో తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సంవత్సరం త్రిపుర, నాగాలాండ్, కర్ణాటక, మేఘాలయ, మిజోరాం, చతిస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది . ఈ నేపథ్యంలోనే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

English summary
The 2-day BJP national executive meeting will begin with PM Modi's road show. There will be many decisions in these meetings aimed at 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X