రూ.1కే రీఛార్జ్ ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్..!
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్).. దీపావళి పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు ఒక అద్భుతమైన శుభవార్తను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కి "బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా" అనే పేరుతో తీసుకొస్తున్నారు. కేవలం రూ.1కే 30 రోజులపాటు అపరిమిత సేవలను అందించే సరికొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఆఫర్ వివరాలు..
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన ఈ "దీపావళి బొనాంజా" ఆఫర్‌తో కేవలం రూ.1 చెల్లిస్తే 30 రోజులపాటు విస్తృతమైన మొబైల్ సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అలాగే రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్ లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వినియోగదారులకు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా అందజేస్తారు.

ఆఫర్ వ్యవధి..
ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 15, 2025 నుంచి నవంబర్ 15, 2025 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. గడువు ముగిసిన తరువాత, ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.
అయితే బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే రూపొందించబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదని అంటున్నారు. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడానికే ఈ స్కీం తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు తమ సమీప బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధికారిక రిటైలర్ వద్దకు వెళ్లి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా "BSNL Selfcare App" ద్వారా కూడా ఆఫర్ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు అందించి కొత్త కస్టమర్లను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీగా నిలవడానికి.. ఈ తరహా పథకాలను రూపొందిస్తున్నట్టు భావిస్తున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల తన 4G నెట్‌వర్క్ విస్తరణ పనులు దేశవ్యాప్తంగా వేగవంతం చేసింది. అధికారుల ప్రకారం 2026 నాటికి పూర్తి స్థాయి 4G సేవలు అందించడమే కాకుండా.. 5G సేవలను కూడా ప్రారంభించే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కొత్త టవర్స్ నిర్మాణం జరుగుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను తన అధికారిక X (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో "BSNL Diwali Bonanza - Unlimited for రూ.1!" అంటూ ప్రకటించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రైవేట్ టెలికాం సంస్థలకు "వేకప్ కాల్" అని వ్యాఖ్యానిస్తున్నారు. "కేవలం ఒక రూపాయికే మంచి ఆఫర్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications