Budget 2024: లక్ష కోట్లతో యువతకు కార్పస్ ఫండ్; రాష్ట్రాలకు సాయమందిస్తాం: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక ఈ మధ్యంతర బడ్జెట్ ప్రధానంగా దేశంలోని రైతులు, నిరుపేదలు, మహిళలు, యువత ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం పైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన సమయంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది అని, ఇప్పుడు ఆ సవాళ్ళను అధిగమించి ప్రస్తుతం దేశం సుసంపన్నంగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ శతాబ్దంలో చూసిన భయంకరమైన కరోనాను ఎదుర్కొన్నామని, ఆర్ధికంగా బలంగా అడుగులు వేశామన్నారు. ఇక అనేక బడ్జెట్ కేటాయింపులు ప్రకటించిన నిర్మల సీతారామన్ యువత కోసం లక్ష కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తామని వెల్లడించారు.

టెకీ యువతకు రుణాలు ఇచ్చేందుకు సుమారు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో భాగంగా 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఆ రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. సుదీర్ఘ కాలం ఫైనాన్సింగ్, రీ ఫైనాన్సింగ్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను చేపట్టనున్నట్టు నిర్మల సీతారామన్ వెల్లడించారు.
యువతకు నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ అనేది లేకుండా దీర్ఘకాలిక రుణాలు ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన నిర్మల సీతారామన్ యువత కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేయడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుందని తెలిపారు. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తామని మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications