దుర్గామాత నిమజ్జనం: హైకోర్టులో మమతా సర్కార్‌కు షాక్
దుర్గామాత నిమజ్జనం అంశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో గురువారం గట్టి షాక్ తగిలింది. దుర్గామాత విగ్రహాలను ఎప్పుడైనా నిజమజ్జనం చేసుకోవచ్చునని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
కోల్‌కతా: దుర్గామాత నిమజ్జనం అంశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో గురువారం గట్టి షాక్ తగిలింది. దుర్గామాత విగ్రహాలను అర్ధరాత్రి 12 దాకా నిజమజ్జనం చేసుకోవచ్చునని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
మొహర్రం పర్వదినం సహా ఏ రోజైనా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చునని న్యాయస్థానం తెలిపింది. హిందువులైనా, ముస్లీంలైనా వారి మధ్య గీత గీయవద్దని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

కాగా, ఆగస్టు చివరి వారంలో మమతా బెనర్జీ దుర్గామాత పూజా కమిటీ, మొహర్రం కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నవరాత్రులు, మొహర్రం పండుగపై చర్చించారు.
అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని పూజా కమిటీ ప్రతినిధులకు సూచించారు. అదే రోజున మొహర్రం పండుగ ఉన్నందున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున అక్టోబర్ 2న దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు, పోలీసులకు ముఖ్యమంత్రి మమత ఈ విషయంపై ఆదేశాలు ఇచ్చారు. నవరాత్రులు, మొహర్రం పండుగ ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని మమత సూచించారు.
అయితే, దుర్గామాత నిమజ్జనం విషయంలో ప్రభుత్వం షరతులు పెట్టడాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో మమతా బెనర్జీ సర్కారుకు చుక్కెదురయింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications