లెఫ్టినెంట్ కల్నల్ ఇంట్లో సీబీఐ సోదాలు.. నోట్ల కట్టలు చూసి షాక్..
డిఫెన్స్ విభాగంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్(CBI) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి దీపక్ కుమార్ శర్మ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అతడ్ని అరెస్ట్ చేశారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు డిసెంబర్ 19 న ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న దీపక్ కుమార్ శర్మతోపాటుగా అతని సతీమణి కల్నల్ కాజల్ బాలీ, అలాగే దుబాయ్ కు చెందిన ఓ కంపెనీపై నేరపూరిత కుట్ర, లంచం ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశారు.
లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్(CBI) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతనితోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి అయిన వినోద్ కుమార్ ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. దిల్లీలోని దీపక్ కుమార్ శర్మ ఇంటిలో రైడ్ నిర్వహించిన అధికారులు సోదాలు జరిపి భారీ మొత్తంలో డబ్బును గుర్తించారు. రూ. 2.36 కోట్లను సీజ్ చేశారు. అలాగే శ్రీ గంగానగర్ లో ఉన్న దీపక్ కుమార్ శర్మ సతీమణి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 10 లక్షలు సీజ్ చేశారు. డిఫెన్స్ విభాగంలో కల్నల్ స్థాయి అధికారి ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
The Central Bureau of Investigation (CBI) has arrested Lt Col Deepak Kumar Sharma and a private person, Vinod Kumar, in a bribery case today
— ANI (@ANI) December 20, 2025
The case has been registered on 19.12.2025 on the basis of a reliable source information against Lt Col. Deepak Kumar Sharma, Deputy… pic.twitter.com/PF39g8NrGA
లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ, వినోద్ కుమార్ లను అరెస్ట్ చేసిన వెంటనే సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. దాంతో కోర్టు వీరిద్దరికీ ఈ నెల 23 వరకూ పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా విచారించనున్నారు అధికారులు. అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ తోపాటుగా అతని సతీమణి కల్నల్ కాజల్ బాలీ, అలాగే దుబాయ్ కు చెందిన ఓ కంపెనీపై నేరపూరిత కుట్ర, లంచం ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశారు.

లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ కొన్నేళ్లనుంచి లంచం, చట్టరిత్యా నేరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అతడిపై నిఘా ఉంచారు అధికారులు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ. 3 లక్షలు తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. శర్మ సన్నిహితుడు వినోద్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. దిల్లీ, శ్రీ గంగానగర్ లోని దీపక్ కుమార్ శర్మ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు జరిపిన అధికారులు రూ. రూ. 2.36 కోట్లను అలాగే మరోచోట రూ. 10 లక్షలు సీజ్ చేశారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications