వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VR Chaudhari: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కొత్త చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి...

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా వివేక్‌ రామ్‌ చౌదరిని నియమించబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్,2024 వరకు మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం చౌదరిని ఈ పదవికి ఎంపిక చేసింది.ప్రస్తుతం ఐఏఎఫ్‌ చీఫ్‌గా కొనసాగుతున్న రాకేశ్‌కుమార్‌ సింగ్‌ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 21) కొత్త చీఫ్‌ను కేంద్రం ప్రకటించింది.

ప్రస్తుతం వీఆర్‌ చౌదరి డిప్యూటీ ఎయిర్‌ చీఫ్‌ స్టాఫ్‌గా కొనసాగుతున్నారు.డిసెంబర్‌ 29, 1982న ఆయన ఐఏఎఫ్‌లో చేరారు. దాదాపు 39 సంవత్సరాల కెరీర్‌లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు. మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సుమారు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది.

centre decides to appoint vivek ram chaudhari as nex iaf chief

గతంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్(WAC)కి కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు.ఆగస్టు 2020 నుంచి జులై 2021 వరకు ఆ పదవిలో ఉన్నారు.అంతకుముందు,ఈస్టర్న్ ఎయిర్ కమాండ్(EAC)కి సెకండ్ ఇన్ కమాండ్‌గా వ్యవహరించారు.

'ఎయిర్ మార్షల్ చౌదరి ఆల్ రౌండ్ అనుభవం కలిగిన ప్రొఫెషనల్.ఎయిర్‌ఫోర్స్‌లో అన్ని మేజర్ డిపార్ట్‌మెంట్‌లతో ఆయన వర్చువల్‌గా పనిచేశారు.డబ్ల్యూఏసీ చీఫ్‌గా,ఈఏసీ సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. భారత్ ప్రత్యర్థులైన పాక్,చైనా గురించి ఆయనకు బాగా తెలుసు.' అని ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ, వెల్లింగ్టన్‌ పూర్వ విద్యార్థి. ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పశ్చిమ ఎయిర్‌ కమాండ్‌ (WAC) కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా పని చేశారు.

వివేక్ రామ్ చౌదరి అందించిన సేవలకు గాను గతంలో పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్,అతి విశిష్ట్ సేవా మెడల్,వాయుసేన మెడల్స్ వరించాయి. ఐఏఎఫ్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న వివేక్ రామ్ చౌదరి తాజా బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
The Center has announced the appointment of Vivek Ram Chaudhary as the Chief of the Indian Air Force. He will continue in that position for three years until September, 2024.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X