గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాకింగ్ వార్త..! ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఈ యుద్దంలో ఇప్పుడు అమెరికా కూడా వచ్చి చేరింది. ఇరాన్ లోని మూడు అణు స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. అమెరికా చర్యపై భగ్గుమంటున్న ఇరాన్..ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా అయ్యే ప్రధాన మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని మూసేయాలని నిర్ణయించింది. అయితే ఇది ఎప్పటి నుంచి అన్నది తేలలేదు.
ఈ పరిణామాలు సాధారణంగానే చమురు, గ్యాస్ దిగుమతులపై భారీగా ఆధారపడిన భారత్ ను కలవరపెడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్, అందులో అమెరికా తలదూర్చడం భారత్ కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసేసే అవకాశం ఉన్నందున దేశంలో ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని తేల్చేసింది.

భారత్ లో ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాడుతున్న ఎల్పీజీ సిలెండర్లలో మూడింటి రెండో వంతు పశ్చిమాసియా నుంచి వస్తున్న గ్యాస్ నుంచే నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావంతో వీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. ఇదే విషయాన్ని కేంద్రం నిర్ధారించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశం దిగుమతి టెర్మినల్స్, శుద్ధి కర్మాగారాలు, బాట్లింగ్ ప్లాంట్లలో ఎల్పీజీ నిల్వ సామర్ధ్యం జాతీయ సగటు వినియోగానికి కేవలం 16 రోజులు మాత్రమే సరిపోతుంది.

అయితే గత కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సరఫరాను మెరుగుపరిచామని, తమ సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా భారత్ పై ఉండకపోవచ్చని ఆయన వెల్లడించారు. అయినా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎల్బీజీ గ్యాస్ రప్పిస్తే దాని ధరల మంట మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
-
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..!












Click it and Unblock the Notifications