ఢిల్లీ పేలుళ్లతో ఎర్రకోటతో పాటు చాందినీ చౌక్ మూసివేత.. ఎందుకంటే
నిన్న సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది. ఊహించని విధంగా జరిగిన పేలుడులో
ఎర్రకోట మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎర్రకోట ను నవంబర్ 11 నుండి నవంబర్ 13వ తేదీ వరకు మూడు రోజులపాటు సందర్శకుల కోసం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన పైన దర్యాప్తు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

తాత్కాలికంగా మూసివేత ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
దర్యాప్తు బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి భద్రతను సమీక్షించడానికి వీలుగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు తాత్కాలికంగా మూసివేత ను ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత నవంబర్ 13 తర్వాత తిరిగి ఎర్రకోట ను తెరిచే విషయం పైన అప్పటి పరిణామాల తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
చాందినీ చౌక్ మూసివేత
మరోవైపు ఢిల్లీలో జన సమర్థం ఎక్కువగా ఉండే చాందిని చౌక్ వంటి ప్రాంతాల్లో కూడా భద్రతా కారణాల దృష్ట్యా మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజుల పాటు చాందిని చౌక్ ను మూసివేయనున్నారు. అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా, ఢిల్లీకి చెందిన వారికి ఢిల్లీకి వచ్చిన వారికి షాపింగ్ చేయడానికి మంచి ప్రదేశంగా ఉండే చాందిని చౌక్ ప్రాంతాన్ని మూడు రోజుల పాటు మూసి వేస్తున్నారు.
చాందినీ చౌక్ భద్రత నేపధ్యంలో నిర్ణయం
చాలా పురాతనమైన చాందిని చౌక్ మార్కెట్ కు 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్ ను షాజహాన్ స్థాపించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపూర్ మసీదు, ప్రసిద్ధ సిక్కు గురుద్వార్, సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి ఉండడంతో మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ ప్రదేశం పైన కూడా ఉగ్రవాదులు ఫోకస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications