Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్, పేలోడ్స్ టర్న్‌డ్ ఆఫ్

బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడిపై పగలు(14 రోజులు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్‌లోకి పంపింది.

రోవర్‌కు అమర్చిన ఏపీ ఎక్స్‌ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ పనులను నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తిస్థాయిలో రీఛార్జ్ అయిందని, మళ్లీ సూర్యోదయం కాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానెల్‌ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.

Chandrayaan-3: As Pragyan Rover Completes Its Assignments, It Is Set Into ‘Sleep Mode’

కాగా, ఆగస్టు 23న చంద్రయాన్‌-3 చంద్రుడిపై దిగినప్పుడు చంద్రుని సూర్యోదయం జరిగింది. కాబట్టి, చంద్రునిపై తదుపరి చంద్ర సూర్యోదయం సెప్టెంబర్ 22న సంభవిస్తుందని ఇస్రో అంచనా వేసింది. అన్నీ సజావుగా సాగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్ తన పరిశోధనలను కొనసాగించనుంది. లేదంటే భారతదేశపు ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది. ఇప్పటి వరకు రోవర్ సేకరించిన డేటాను ఇస్రో విశ్లేషన్ చేస్తోంది.


సెప్టెంబర్ 2 నాటికి, ప్రజ్ఞాన్.. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో 100 మీటర్లకు పైగా ప్రయాణించింది. చంద్రునిపై విక్రమ్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత, ప్రజ్ఞాన్ దక్షిణ దిశగా కదిలింది. అప్పుడు, రోవర్ ఆగ్నేయ దిశగా కదిలింది. నాలుగు మీటర్ల పరిమాణంలో పెద్ద బిలం వచ్చింది. వరుస ఆదేశాల తర్వాత, సురక్షితమైన మార్గానికి వెళ్లేందుకు ప్రజ్ఞాన్ వాయువ్య దిశకు మళ్లింంది. తరువాత, అది తూర్పు వైపుకు, ఆపై పశ్చిమ దిశగా కదిలింది.

పశ్చిమం వైపు చాలా దూరం ప్రయాణించిన తరువాత, ప్రజ్ఞాన్ ఉత్తరం వైపు, ఆపై దక్షిణం వైపు తిరిగింది. తరువాత, ప్రజ్ఞాన్ ఈశాన్య, ఆపై ఉత్తరం వైపు కదిలింది. ప్రగ్యాన్‌లోని రెండు పేలోడ్‌లు చంద్రుని దక్షిణ ధ్రువంలో సల్ఫర్ ఉనికిని నిర్ధారించాయి. అవి అల్యూమినియం, సిలికాన్, ఆక్సిజన్, మాంగనీస్ వంటి ఇతర మూలకాలను కూడా గుర్తించాయి. దీంతో చంద్రయాన్-3 పరిశోధనా లక్ష్యంగా పూర్తిగా నెరవేరినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+