అర్దరాత్రి కారులో జంట, రేయ్ ఇక్కడ ఏం పీకుతున్నావ్ ?, స్పాట్ లో డీల్, గూగుల్ పేతో ?

త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన జంట కారులో కుర్చుని ఉంటే వారిని బెదిరించి గూగుల్ పే ద్వారా లంచం తీసుకుని వెళ్లిపోకుండా పోలీసులు ఓ పనికిమాలిన పనిచేసి వెళ్లారు.

చెన్నై: యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లికి యువతి, యువకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. త్వరలో పెళ్లి చేసుకోవలసిన యువతి, యువకుడు అప్పుడప్పుడు కలిసి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అర్దరాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన జంట కారులో కుర్చుని ఉంటే వారిని బెదిరించి గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్నారు. లంచం తీసుకుని వెళ్లిపోకుండా పోలీసులు ఓ పనికిమాలిన పనిచేసి వెళ్లారు.

 నిశ్చితార్థం జరిగిపోయింది

నిశ్చితార్థం జరిగిపోయింది

చెన్నై సిటీలోని గుడువాంచేరి ప్రాంతానికి చెందిన కృష్ణన్ అనే వ్యక్తికి, చెన్నైలోనే నివాసం ఉంటున్న మరో యువతికి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చచించారు. ఇప్పటికే కృష్ణన్, ఆ యువతి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో కాబోయే దంపతులు అప్పుడప్పుడు ఏకాంతంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. రాత్రి ఆరంబాక్కం ప్రాంతంలో కృష్ణన్ అతను నిశ్చితార్థం చేసుకున్న యువతితో కారులో కుర్చుని మాట్లాడుతున్నాడు.

 పోలీసులు ఎంట్రీ

పోలీసులు ఎంట్రీ

అమృతరాజ్, మణిభారతి చెన్నైలోని తాంబరం సమీపంలోని మణిమంగళం పోలీస్ స్టేషన్‌లో పోలీసులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ మణిమంగళం సరిహద్దులోని పాతప్పాయి, ఆర్మాకం తదితర ప్రాంతాల్లో ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తుంటారు. రాత్రి గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు కారులో మాట్లాడుకుంటున్న కాబోయే దంపతులను చూసి వారి దగ్గరకు వెళ్లారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని పోలీసులు వారిని ప్రశ్నించారు.

 పెళ్లి నిశ్చితార్థం అయ్యింది

పెళ్లి నిశ్చితార్థం అయ్యింది

మేము కాబోయే దంపతులు అని, ఇప్పటికే పెళ్లి నిశ్చితార్థం అయ్యిందని, పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారని కృష్ణన్ పోలీసులకు చెప్పాడు. మీ మీద మాకు అనుమానం ఉందని పోలీసులు ఆ జంటను బెదిరించారు. మీరు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని, మిమ్మల్ని విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెలుతామని వారినిని బెదిరింపులకు గురి చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగనుండగా పోలీస్ స్టేషన్ కు వెలితే పరువు పోంతుందని కాబోచే జంట భపడ్డారు.

 లంచాలకు గూగుల్ పే

లంచాలకు గూగుల్ పే

రూ. 10వేలు చెల్లిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే ఎంజాయ్ చేసుకోవచ్చిన పోలీసులు ఆ జంట ముందు బేరం పెట్టారు. అయితే తమ వద్ద రూ. 10 వేల రూపాయలు లేవని, కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని ఆ జంట చెప్పడంతో పోలీసులు కొంత సేపు వారితో బేరం మాట్లాడారు. చివరికి గూగుల్ పే ద్వారా రూ. 4 వేలు లంచం తీసుకున్న పోలీసులు ఈ విషయం బయటకు చెబితే మిమ్మల్ని జైలుకు పంపిస్తాామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ధైర్యం చేసిన యువకుడు

ధైర్యం చేసిన యువకుడు

పోలీసులు వెళ్లిపోయిన కొంతసేపటి తర్వాత కృష్ణన్‌ చెన్నై సిటీ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు మానుంచి డబ్బులు వసూలు చేశారని కృష్ణన్‌ తెలిపారు. తరువాత కాబోయే భార్యను వెంటపెట్టుకుని వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు తాంబరం పోలీస్‌ కమిషనర్‌ అమల్‌రాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు.

 దూలతీరిపోయింది

దూలతీరిపోయింది

పోలీసుల విచారణలో కానిస్టేబుళ్లు అమృతరాజ్, మణిభారతి మాయాజాలం బయటకు రావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్‌లో కంట్రోల్ రూమ్ లో ఇద్దరు పోలీసులను రహస్యంగా విచారించగా వాళ్లు గూగుల్ పే ద్వారా ద్వారా లంచం డబ్బు తీసుకున్నామని అంగీకరించారని, ఇద్దరి మీద కేసు నమోదు చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు గూగుల్ పే ద్వారా లంచాలు తీసుకోవడం చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+