Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Youtuber Pubg Madan Arrested: మన్మధుడు మదన్ అరెస్టు, నెలకు రూ. 7 లక్షలు ఆధాయం, అమ్మాయిల దెబ్బతో !

చెన్నై/దర్మపురి/ బెంగళూరు: వయసులో ఉన్న యువతులను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్జి మదన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మదన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ అడ్మిన్ అయిన అతని భార్యను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మదన్ తండ్రి, సోదరుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పబ్జి గేమ్ ని అడ్డుపెట్టుకుని మదన్ అమ్మాయిలను అసభ్యంగా పబ్లిక్ గా అమ్మనా బూతులు తిట్టాడని, అమ్మాయిల అశ్లీల వీడియోలను టెలిగ్రామ్ లో, సోషల్ మీడియాలో విక్రయిస్తున్నాడని, మనీలాండరింగ్ కు పాల్పడుతున్నాడని తదితర ఆరోపణల మీద మదన్ మీద 150కి పైగా ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. యూట్యూబ్ తో ఫేమస్ అయ్యి 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న మదన్ ప్రతినెల రూ. 7 లక్షలకు పైగా సంపాధింస్తూ రెచ్చిపోతున్నాడని వెలుగు చూసింది.

చిన్న వయసులో యూట్యూబ్ చానల్దరివాడు

చిన్న వయసులో యూట్యూబ్ చానల్దరివాడు

తమిళనాడులో పబ్జి గేమ్ కు బానిసలు అయిన యువతి, యువకులను మదన్ టార్గెట్ చేసుకున్నాడు. మదన్ కు యూట్యూబ్ లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మదన్ యూట్యూబ్ చానల్ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. కొన్ని లక్షల మంది యువతి యువకులు మదన్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

 మనోడి మీద 150 ఫిర్యాదులు

మనోడి మీద 150 ఫిర్యాదులు

మదన్ కు కొన్ని లక్షల మంది అమ్మాయిలు అభిమానులుగా మారిపోయారు. పబ్జి గేమ్ అడ్డుపెట్టుకుని మదన్ అమ్మాయిలను అసభ్యంగా పబ్లిక్ గా బూతులు తిట్టాడని, అమ్మాయిలను అభ్యంతరకరమైన మాటలతో, అసభ్యంగా పబ్లిక్ గా బండబూతులు తిడుతున్నాడు. మదన్ యూట్యూబ్ చానల్ లో రెచ్చిపోయి అమ్మాయిలను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడంతో అతని మీద ఇప్పటికే సుమారు 150 మంది బాధితులు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులకు, తమిళనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 మన్మధుడు ఎస్కేప్

మన్మధుడు ఎస్కేప్

అమ్మాయిల అభ్యంతరకరమైన వీడియోలు, అశ్లీల వీడియోలు టెలిగ్రామ్ లో విక్రయిస్తున్నాడని, అమ్మాయిలను వారి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తదితర ఆరోపణల మీద మదన్ మీద చెన్నైలోని పులియంతోపు, చెన్నై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో మన్మధుడు మదన్ పరారైనాడు. తమిళనాడు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు మదన్ మీద ఫిర్యాదు చేశారు.

 భార్య, తండ్రి, సోదరుడు

భార్య, తండ్రి, సోదరుడు

మదన్ కోసం వెతుకుతున్న తమిళనాడు సీబీసీఐడి పోలీసులు అతని భార్య కృతిక, మదన్ తండ్రి, సోదరుడు సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు. మదన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ కు అతని భార్య కృతిక అని గుర్తించారు. మదన్ యూట్యూబ్ చానల్ కు కృతిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తోందని, ఆ యూట్యూబ్ చానల్ కు కృతిక ఈ మెయిల్ ఐడీ లింక్ చేశారని వెలుగు చూడటంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మదన్ సోదరుడు సంపత్ తో పాటు ఆయన తండ్రి, మదన్ స్నేహితుల పాత్రపై సీబీసీఐడీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

 బెయిల్ కోసం ప్రయత్నాలు

బెయిల్ కోసం ప్రయత్నాలు

భార్య కృతికను అరెస్టు చెయ్యడంతో హడలిపోయిన మదన్ మద్రాసు హైకోర్టులో మందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మదన్ యూట్యూబ్ చానల్ ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను ఎంత నీఛంగా తిట్టాడో తెలుసుకున్న కోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మదన్ కు బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నించిన న్యాయవాదికి మదన్ యూట్యూబ్ అడ్డం పెట్టుకుని అమ్మాయిలను ఎలా బూతులు తిట్టాడో వినిపించిన కోర్టు మదన్ కు బెయిల్ ఇవ్వలేదు.

 ధర్మపురిలో మకాం

ధర్మపురిలో మకాం

మద్రాసు హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో మదన్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు. నాలుగు రోజుల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు మదన్ చిక్కలేదు. ఇంటిలిజెన్స్ పోలీసులు మదన్ ధర్మపురిలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడని చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ధర్మపురిలో మదన్ ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి అతన్ని చెన్నై తీసుకు వెలుతున్నారు.

 యూట్యూబ్ చానల్ లో నెలకు రూ. 7 లక్షలు ఆధాయం

యూట్యూబ్ చానల్ లో నెలకు రూ. 7 లక్షలు ఆధాయం

పబ్జి గేమ్ బానిసలు, అమ్మాయిలను టార్టెట్ చేసుకున్న మదన్ అతని యూట్యూబ్ చానల్ ద్వారా నెలకు రూ. 7 లక్షలకు పైగా సంపాధిస్తున్నాడని పోలీసులు అంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా వస్తున్న ఆధాయంతో మదన్ లగ్జరీ కారు తీసుకుని పెద్ద బంగ్లాలో ఉంటూ భార్యతో కలిసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని పోలీసులు అంటున్నారు. అమ్మాయిల అశ్లీల వీడియోలు విక్రయించాడని, మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని, టెలిగ్రామ్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు విక్రయించాడని, మహిళలను అసభ్యంగా దూషించాడని మదన్ మీద అనేక కేసులు నమోదు అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+