
కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ ఘడ్ సీఎం బాగల్
దీపావళి పర్వదినం సందర్భంగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థులు విశ్వాసిస్తారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఆయన కొరఢా దెబ్బలు తిన్నారు. అప్పట్లో ఆ వార్త వైరల్ అయ్యింది. ఆ ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు తినడం సహాజంగా జరుగుతుంటుంది.
పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలను కూడా కాచుకుంటారు. సీఎం బాగల్ కూడా ఇలా కొరడా దెబ్బలు తిన్నారు. అనంతరం ఆ వీడియో ట్విట్ చేశారు. మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలో గల జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ జరగింది. సీఎం భూపేష్ బాగల్ అందులో పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

తర్వాత జరిగే కార్యక్రమంలో మిగతా భక్తుల మాదిరిగా బాగల్ పాల్గొన్నారు. వారి మాదిరిగా కొరడా దెబ్బలు తిన్నారు. దీంతో శుభం కలుగుతుందని స్థానికులు విశ్వసించారు. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాగల్ కూడా పాటించారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.