యూపీలో హిందూదేవుళ్ళ చిత్రాలున్న పేపర్లలో చికెన్ విక్రయాలు; పోలీసులకు హిందువుల ఫిర్యాదు; వ్యక్తి అరెస్ట్!!
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ తాజాగా ఓ వ్యక్తి చేసిన పనితో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. హిందూ దేవతల చిత్రాలు ఉన్న పేపర్లలో కోడి మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన చోటు చేసుకుంది. ఇక దీని పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు పోలీసులను ఆశ్రయించడంతో హిందూ దేవతల చిత్రాలు ఉన్న పేపర్లలో చికెన్ ను ప్యాక్ చేసి విక్రయిస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూ దేవతల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హిందూ దేవతల చిత్రాలతో కూడిన కాగితాలపై చికెన్‌ను విక్రయించడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ప్రయత్నించారని, అతడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసు బృందంపై దాడి చేసినందుకు కూడా అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.

హిందూ దేవుళ్ళ చిత్రాలున్న కాగితాలతో చికెన్ అమ్మకాలు.. హిందువుల ఫిర్యాదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబ్ హుస్సేన్ అనే వ్యక్తి తన దుకాణంలోని చికెన్‌ను హిందూ దేవతల చిత్రాలు ఉన్న కాగితంపై అమ్ముతున్నాడని, తమ మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నాడని కొందరు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు గా పోలీసులు తెలిపారు. తాలిబ్ హుస్సేన్ కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని, మాంసాన్ని కావాలని హిందూ దేవతల చిత్రాలు ఉన్న పేపర్లలో చుట్టి విక్రయాలు జరుపుతున్నాడని పలువురు హిందువులు ఆరోపిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మాంసం ప్యాక్ చేస్తూ హిందూ దేవుళ్ళను అపవిత్రం చేస్తున్నారని హిందూ సంఘాల నాయకులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో నాన్‌వెజ్‌ను వార్తాపత్రికల్లో దేవతల ఫోటోలతో ప్యాక్ చేసి విక్రయిస్తున్న తాలిబ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ, మెహక్ రెస్టారెంట్ అనే హోటల్ కౌంటర్ నుండి దేవతల ఫోటోలతో కూడిన వార్తాపత్రికలు కూడా భారీ సంఖ్యలో కనుగొనబడ్డాయి. ముఖ్యంగా ముస్లిం లు హిందూ దేవతా చిత్రాలను మాంసాహారం ప్యాక్ చేస్తూ అపవిత్రం చేస్తున్నారని సోషల్ మీడియాలో పలువులు హిందూ సంఘాల నాయకులు పోస్ట్ లు చేస్తున్నారు.

పోలీసులపైనా దాడికి యత్నం చేసిన చికెన్ షాప్ ఓనర్ .. కేసు నమోదు
అయితే పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఒక పోలీసు బృందం తాలిబ్ హుస్సేన్ దుకాణానికి వెళ్లిన క్రమంలో హుస్సేన్ వారిపై దాడికి ప్రయత్నించాడు. పోలీసులను చంపాలనే ఉద్దేశ్యంతో వారిపై కత్తితో దాడి చేశాడని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక అతనిపై ఐపీసీ సెక్షన్లు 153-A , 295A మరియు 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications