చైనా ఆహార సంక్షోభానికి ఇండియాతో సరిహద్దు ఉద్రిక్తతలకు లింక్ .. ఇంట్రెస్టింగ్ కదూ !!
చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి ఎందుకు కాలు దువ్వుతుంది. ఒకపక్క ఆహార సంక్షోభం ఉందని, ఖర్చులు తగ్గించుకోవాలని చెబుతున్న చైనా, ఇండియా తో లద్దాఖ్ వద్ద , అదే విధంగా దక్షిణ సముద్రంలో కూడా ఉద్రిక్తతలకు ఎందుకు కారణం అవుతోంది అంటే చైనా ఆహార సంక్షోభానికి, ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలకు కారణం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.
Recommended Video

1962లో మావో జెడాంగ్ తరహాలోనే ఇప్పుడు జిన్ పింగ్
కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ 2013 నాటి క్లీన్ యువర్ ప్లేట్ కార్యక్రమాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, ఆహారాన్ని వృథా చేయొద్దని సూచించారు. ఇప్పుడు ఈ ఆహార సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో చెప్పకుండా చైనా భారత సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుంది. ఉద్రిక్తతను పెంచుతుంది. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోంది గతంలో 1962లో ఆహారం వృధా అరికట్టడం కోసం మావో జెడాంగ్ కూడా ఇటువంటి చర్యలకు దిగారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు .

ప్రజల దృష్టి మరల్చే వ్యూహంలో భాగమే సరిహద్దు ఉద్రిక్తతలు
1962లో ఆహారం వృధా నివారించడానికి మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ మూమెంట్ ను తీసుకు వచ్చారు. దాని ఫలితంగా కోట్లాది మంది చైనీయులు ఆకలితో మృతిచెందారు. అయితే , ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికే కాకుండా, చైనీయుల, ప్రపంచ దేశాల దృష్టిని మరల్చటం కోసం 1962లో భారత సరిహద్దు వివాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి సరిహద్దు వివాదం పై పడింది. ప్రస్తుతం జిన్ పింగ్ కూడా చైనీయుల ఆహార సంక్షోభ సమస్యను పరిష్కరించలేక, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, దృష్టి మరల్చడం కోసం సరిహద్దులో వివాదాలకు కాలు దువ్వుతుంది.

చైనాలో ఆహార సంక్షోభానికి కారణాలివే
సరిహద్దు వివాదాలను ముందుకు తీసుకువచ్చి ప్రజలు ఆహార సంక్షోభంపై మాట్లాడకుండా చేయాలని చూస్తున్నారు.
చైనాలో ఆహార సంక్షోభానికి కారణాలు గమనిస్తే వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు చైనాకు గణనీయంగా తగ్గిపోయాయి . చైనా ఆహార అవసరాలను 30 శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోపక్క కరోనా వైరస్ కారణంగా భారత్ వియత్నాంలు వరి ఎగుమతిపై ఆంక్షలు విధించాయి . ఇదే సమయంలో ఆఫ్రికన్స్ స్వైన్ ఫీవర్ కారణంగా చైనాలో 100 మిలియన్ల పందులను చంపారు.

తక్కువ తినాలని చెప్తున్న చైనా .. కయ్యానికి కాలు దువ్వే కారణం ఇదే !!
చైనాలో మెజారిటీ జనాభాకు పందులే ప్రధమ ఆహార వనరు. ఈ సమయంలో వాటిని కూడా చంపడంతో చైనాకు ఆహార సంక్షోభం ఏర్పడింది. ఈ ఆహార సంక్షోభాన్ని తీర్చలేని చైనా ప్రజలను తక్కువ తినాలి అని చెబుతోంది. ప్రజల దృష్టి మరల్చడానికి భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. సరిహద్దు వివాదాలతో డ్రాగన్ దుర్బుద్ధి ని చూపిస్తోంది.అటు చైనీయుల దృష్టిని , ప్రపంచ దృష్టిని చైనాలో నెలకొన్న ఆహార సంక్షోభం పై పడనీకుండా సరిహద్దు ఘర్షణలపై పడేలా చేస్తుంది.
-
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications