ఇండియా కూటమిని అందుకే రావొద్దన్నా..! తేల్చేసిన సీజేఐ సూర్యకాంత్ ..!

ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ఇండియా కూటమి నేతల్ని కలిసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ (సీజేఐ) సూర్యకాంత్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి నేతలు తనను కలిసేందుకు పంపిన అభ్యర్దనను తిరస్కరించిన సూర్యకాంత్ .. ఆ మేరకు వారికి సమాధానం పంపారు. ప్రతిపక్ష నాయకులను తాను ఎందుకు కలవలేకపోతున్నానో వివరిస్తూ విపక్ష నేతలకు సమాధానం పంపినట్లు ఆయన తెలిపారు.

CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?

ఇండియా కూటమి భేటీకి సంబంధించిన అభ్యర్థనతో కూడిన లేఖ తనకు నిన్న అందిందని, దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చానని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ (CJI) సూర్యకాంత్ తెలిపారు. అందులో తాను వారిని ఎందుకు కలవలేకపోతున్నానో కారణాలను వివరించినట్లు సీజేఐ వెల్లడించారని ఎఎన్ఐ వార్తాసంస్ధ తెలిపింది. అయితే, ఆ కారణాలను బహిరంగంగా వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని, సామాన్య పౌరుల నుంచి లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఏ పిటిషన్‌నైనా తాము స్వాగతిస్తామని సీజేఐ పేర్కొన్నారు.

CJI Says Access to Supreme Court Is Open to All But Meeting Politicians Is No Right
సుప్రీం అసాధారణ నిర్ణయం..! కోర్టు ధిక్కారంపై ఆదివారం విచారణ..!
సుప్రీం అసాధారణ నిర్ణయం..! కోర్టు ధిక్కారంపై ఆదివారం విచారణ..!

ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి సమస్యలను తాము వింటాం, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ సూర్య కాంత్ తెలిపారు. పనితీరులో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను లేవనెత్తేందుకు ఇండియా కూటమి ప్రధాన న్యాయమూర్తిని కలవాలని కోరుతోందన్నారు. అదే తరహా అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున, ప్రతిపక్ష కూటమితో సమావేశం కావడం సముచితం కాదని ప్రధాన న్యాయమూర్తి వారికి ఇదివరకే తెలియజేసినట్లు సమాచారం. అయితే మరోసారి ఢిల్లీ నిరసల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు సీజేఐని కలిసేంందుకు ప్రయత్నించడంతో మరోసారి వారికి ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఇప్పటికే రాష్ట్రపతితో భేటీ అయిన ఇండియా కూటమి నేతలకు ఆమె సైతం సానుకూలంగా స్పందించకపోవడం షాకిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+