మోడీ-షా విభేదాలు? రాజీనామాకు సీనియర్ల నో..! కేబినెట్ ప్రక్షాళన ఆలస్యం వెనుక?
రెండు నెలలుగా అప్పుడు, ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (Cabinet Reshuffle) అంతకంతకూ ఆలస్యమవుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైనా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. అప్పటి నుంచి డెడ్ లైన్లు మారుతున్నాయి కానీ కేబినెట్ ప్రక్షాళన మాత్రం జరగడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న చాలా మంది మంత్రులు అదనపు శాఖల భారం మోయాల్సి వస్తోంది. ఆ మేరకు పాలన కుంటుపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఆలస్యం వెనుక సంచలన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులైన కేబినెట్ మంత్రులకు ఈసారి పొడిగింపు ఇవ్వలేదు. అలాగే పలువురు మంత్రుల్ని అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ఇన్ చార్జ్ లుకా పంపారు. కేంద్రంలో పదవి ఇస్తామని ఊరించి నితీశ్ కుమార్ ను బీహార్ సీఎం పదవి నుంచి దించేశారు. కాక్రోచ్ నిరసనలతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. ఆయన శాఖను ప్రహ్లాద్ జోషీ మోయాల్సి వస్తోంది. అయినా కేబినెట్ ప్రక్షాళనకు ముందడుగు పడటం లేదు. దీని వెనుక ఉన్న కారణాలను కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేత సౌరవ్ దాస్ బయటపెట్టారు.

#Imp: If the drama over the Prime Minister’s birthday is over, can we now focus on how India still does not have a FULL-TIME Education Minister?
— Saurav Das (@SauravDassss) September 17, 2026
Pralhad Joshi, appointed after youth protests forced Dharmendra Pradhan’s resignation, is holding two other ministries. A ministry as…
ప్రధానమంత్రి పుట్టినరోజు నాటకం ముగిస్తే, భారతదేశానికి ఇప్పటికీ పూర్తికాల విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై ఇప్పుడు మనం దృష్టి పెట్టగలమా?అంటూ సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశారు. ప్రధాని, హోం మంత్రికి మధ్య ఉన్న తీవ్రమైన విభేదాల కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నిలిచిపోయిందని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. దానికి తోడు, రాజీనామా చేయమని కోరినా నిరాకరిస్తున్న సీనియర్ మంత్రుల నిశ్శబ్ద తిరుగుబాటు కూడా ఉందన్నారు. పరిపాలన విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దారి తప్పడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారరు. గంభీరమైన పరిపాలనను పణంగా పెట్టి, మొత్తం మంత్రివర్గాన్ని, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలను దీపాలు వెలిగించడం, మహామానవుడికి హారతి ఇవ్వడంలో పెట్టేశారని చురకలు అంటించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులతో పూర్తిగా సంబంధం తెగిపోయిందన్నారు. యువతరం తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల డబ్బును పూర్తిగా పనికిమాలిన వాటిపై ఖర్చు చేయడంలో నిమగ్నమై ఉందని విమర్శించారు. భారతదేశం, దాని యువత ఇంతకంటే మెరుగైన దానికి అర్హులు, పూర్తికాల విద్యాశాఖ మంత్రితో ఇది ప్రారంభం కావాలని కోరారు. ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించలేకపోవడం విద్యా మంత్రిత్వ శాఖలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోందన్నారు. మంత్రి చివరికి పదవి నుంచి తప్పుకుంటారని తెలిసి అధికారులు వణికిపోతున్నారన్నారు. కానీ జంతర్ మంతర్‌కు ముందు నెలల నుంచే ఈ పునర్వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉందని, పరిపాలన పూర్తిగా కుప్పకూలిపోయిందని విమర్శించారు.














Click it and Unblock the Notifications
