Video: రెచ్చిపోయి పోలీసుల ముందే ఆడపిల్లలపై భీకర దాడి.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, మహిళా ఉద్యమకారులపై దాడులు జరగడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఢిల్లీ పోలీసులను వాడుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే మహిళలు, యువతపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. మరోవైపు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్‌లో మహిళలపై, విద్యార్థులపై దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు నలుగురు హిందూ రక్షా దళ్ సభ్యులను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ వీధుల్లో చోటుచేసుకున్న ఈ ఘటనను అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంగా కాక్రోచ్ జనతా పార్టీ అభివర్ణించింది, దీనిని తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే బీజేపీ-ఆర్ఎస్ఎస్ గూండాలు ఒక చిన్నారి పై నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారని సీజేపీ నాయకులు ఆరోపించారు.

అంతేకాకుండా ఆ ఘోరాన్ని ఎవరైనా వీడియో రికార్డింగ్ చేస్తుంటే, దాన్ని వెంటనే ఆపివేయాలంటూ అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి ఆ గూండాలకు సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు మండిపడ్డాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులకు రక్షణ కల్పించాల్సిన ఢిల్లీ పోలీసులు.. ఇలా రౌడీలకు, గూండాలకు అండగా నిలిచి దాడులు చేయించడం వెనుక ఎవరి హస్తం ఉందో, వీరికి ఈ స్థాయిలో ఎవరు విచ్చలవిడి స్వేచ్ఛనిచ్చారో సమాధానం చెప్పాలని సీజేపీ ప్రశ్నించింది.
Jantar Mantar Outcome Monitor@Cockroachisback protest of #JantarMantar is not a Flop ShowLesson from Todays CJP protest#AbhishekMalhan BJP-RSS #JantarMantarDelhi#cjpitsdonebro #ExcellenceInDutyDPMUNAWAR HOSTING PPP S2 ON TVRSS DIVERSITY💔 vs GEN Z💞
— Mir Ilyas (@Mir_Ilyas_INC) October 10, 2026
అమిత్ షా పోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్: మళ్లీ రోడ్లపైకి వస్తామంటూ హెచ్చరిక
ఈ ఉదంతంపై 'ఎక్స్' వేదికగా ఘాటుగా స్పందించిన రాహుల్ గాంధీ, అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. "ఆర్ఎస్ఎస్, బిజెపి గూండాలకు మహిళలు, యువతపై దాడి చేయడానికి పోలీసులు ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఎంతగా అణచివేతకు దిగితే.. యువత , విద్యార్థుల నిరసన జ్వాలలు అంతగా రగులుతాయి. ఢిల్లీ వీధుల్లో 10 వేలు, 20 వేలు కాదు.. ఎంతమంది పోలీసులను రంగంలోకి దించుతారో దించుకోండి. ఇండియా కూటమి, కాంగ్రెస్, దేశ యువత అక్టోబర్ 12న మళ్లీ వీధుల్లోకి వచ్చి తమ నిరసన గళాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తాయి" అని రాహుల్ సవాల్ విసిరారు.
DEEPLY DISTURBING!BJP-RSS goons beating a young girl in the presence of Delhi Police, with an officer seemingly guiding them to stop the recording.Why is Delhi Police helping goons attack peaceful protestors instead of protecting them? Who gave them this free hand? https://t.co/2JeT40wrx2
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026
సీజేఐని కలవనున్న 'ఇండియా' కూటమి
ఢిల్లీ వీధుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బహిరంగంగా కాలరాస్తుంటే చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోలేవని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, ఈ అక్రమాలపై జవాబుదారీతనం ఖరారు చేసేందుకు సోమవారం నాడు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తిని స్వయంగా కలవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలు , శాంతియుత నిరసనకారులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు.
अमित शाह की दिल्ली पुलिस खुद तो गुंडागर्दी पर उतर ही आई - RSS-BJP के असली गुंडों को भी महिलाओं और युवाओं पर हिंसा करने की खुली छूट और बढ़ावा दे रही है।जैसा मैंने कहा था, Mogambo Modi और उसकी सरकार जितना दबाएगी, Gen Z और छात्रों का गुस्सा उतना ही बढ़ेगा।सोमवार, 12 अक्टूबर को कांग्रेस, पूरा INDIA गठबंधन और देश के युवा बड़ी संख्या में एक बार फिर सड़कों पर उतरेंगे। और इस बार भी आवाज़ पूरे देश में गूंजेगी - पहले से कहीं ज़्यादा।@AmitShah, जितनी पुलिस लानी है, 10 हज़ार, 20 हज़ार, 40 हज़ार, ले आइए। BJP-RSS के जितने गुंडे बुलाने हैं, बुला लीजिए।हम डरने वाले नहीं हैं। पीछे हटने वाले नहीं हैं। ये लड़ाई अब रुकने वाली नहीं है!सोमवार को हम मुख्य न्यायाधीश से भी मिलेंगे और मांग करेंगे कि जब दिल्ली की सड़कों पर संविधान को तार-तार किया जा रहा है और लोकतंत्र को कुचला जा रहा है, तब कानून के संरक्षक आंखों पर पट्टी डाल कर नहीं बैठ सकते।संविधान की धज्जियां उड़ेंगी और हम चुप बैठेंगे? ऐसा हरगिज़ नहीं होगा। जवाबदेही तय करवाकर रहेंगे!
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
వైరల్ వీడియో ఆధారంగా నలుగురు నిందితుల ముందస్తు అరెస్ట్
కాక్రోచ్ జనతా పార్టీ నిరసన సందర్భంగా డీడీయూ మార్గ్‌లో విద్యార్థులను కొడుతూ, మహిళా నిరసనకారులపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నిందితులు మహిళలను నెట్టివేస్తూ, దాడికి దిగిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. బాధితుల నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాకపోయినప్పటికీ, నిందితులు ఢిల్లీ-ఎన్‌సిఆర్ దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రావడంతో కమలా మార్కెట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని రామన్ సైని (50), వివేకానంద్ (32), కపిల్ కుమార్ (27), రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ (35)లుగా గుర్తించారు. వీరంతా హిందూ రక్షా దళ్ సభ్యులమని చెప్పుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
