రూటుమార్చిన కాక్రోచ్ లు..! మరో భారీ నిరసన ప్రకటన..!

ఎస్ఐఆర్అక్రమాల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న ఆందోళనల్ని కేంద్రం అడ్డుకుంటోంది. రెండు రోజుల క్రితం విమానంలో ఢిల్లీకి వస్తున్న కాక్రోచ్ పార్టీ నేతల్ని అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్లకు తీసుకెళ్లిన పోలీసులు.. అనంతరం విడిచిపెట్టారు. ఆ తర్వాత జంతర్ మంతర్ ను ఆందోళనలు చేసే ప్రాంతాల జాబితా నుంచి తప్పించారు. దీంతో జంతర్ మంతర్ వద్దకు వెళ్లి జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించిన సీజేపీ నేతల్ని అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఈ పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ భగ్గుమంటోంది.

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్..! ఢిల్లీ నిరసనల వేళ మోడీ కేసులో..!
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్..! ఢిల్లీ నిరసనల వేళ మోడీ కేసులో..!

ఈ నేపథ్యంలో ఎల్లుండి అంటే ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో మరో భారీ నిరసన చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీ కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను అరెస్టు చేసి తీహార్ జైలుకు జ్యుడిషియల్ రిమాండ్ పై పంపారు. ఐదు రోజుల రిమాండ్ పై తీహార్ జైలుకు వారిని తరలించారు. మరోవైపు నానమ్మ మృతితో మహారాష్ట్ర వెళ్లిన సీజేపీ బాస్ అభిజీత్ దిప్కే తిరిగి వచ్చారు. దీంతో ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు.

CJP to Hold Lehra Do Tiranga Protest in Delhi on October 16 Announces Abhijeet Dipke
కేంద్రం ప్లాన్ అదే- ఉచ్చులో పడొద్దు..- ఇండియా కూటమికి దిప్కే కీలక సూచన..!
కేంద్రం ప్లాన్ అదే- ఉచ్చులో పడొద్దు..- ఇండియా కూటమికి దిప్కే కీలక సూచన..!

అక్టోబర్ 16న ఢిల్లీలో మరో నిరసన ప్రదర్శనను చేపట్టబోతున్నట్లు సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కే ప్రకటించారు. "లెహ్రా దో త్రిరంగా" అనే సందేశంతో అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో భారీ సభ నిర్వహిస్తామని దిప్కే ప్రకటించారు. దీంతో ఇప్పటికే నిరసనల హోరుతో మార్మోగుతున్న రాజధాని నగరంలో మరో భారీ నిరసన సభ నిర్వహణ ద్వారా సత్తా చాటుకోవాలని కాక్రోచ్ లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ల అరెస్టులు, రిమాండ్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్లు చేస్తున్నాయి. వీరి విడుదల కోసం ఢిల్లీ స్ధానిక కోర్టులో సీజేపీ పిటిషన్లు కూడా దాఖలు చేసింది. వారిని ఎల్లుండి లోగా విడుదల చేయకపోతే ఢిల్లీలో సీజేపీ చేపట్టే నిరసనల్లో విపక్షాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+