గ్యాంగ్ రేప్ : పరిచయస్తుడే అన్న నమ్మకంతో వెళితే..
న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. తెలిసినవాడే కదా అన్న నమ్మకంతో.. అతని ఫ్లాట్ వెళ్లినందుకు.. మరో ముగ్గరు యువకులతో కలిసి రెండు రోజుల పాటు సదరు మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ నీచుడు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ పదో తరగతి బాలికను కరణ్ అనే ఓ యువకుడు బైక్ పై గుడికి తీసుకెళ్లాడు. తొలుత బస్టాండ్ లో ఉన్న ఆమెతో కరణ్ మాటలు కలపడంతో.. తెలిసిన వ్యక్తే కదా అన్న నమ్మకంతో అతని వెంట బయలుదేరింది బాలిక. అనంతరం మాయ మాటలతో ఆమెను తన ఫ్లాట్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు యువకులు ఆ ఫ్లాట్ కు వచ్చారు. బాలిక స్నేహితుడైన కరణ్, అతని స్నేహితుడు కరణ్ ఇద్దరు కలిసి ఆమెపై లైంగిక దాడి చేశారు. మహేశ్, కాలా మరో ఇద్దరు మిత్రులు ఆ దృశ్యాలను వీడియో తీశారు.

రెండు రోజుల పాటు బాలికను తమ ఫ్లాట్ లోనే బంధించి ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అనంతరం విషయం బయటకు పొక్కితే చంపేస్తామంటూ బెదిరించారు. అయితే సదరు బాలిక ఇంటికి చేరుకోగానే జరిగిందంతా తల్లిదండ్రలకు చెప్పడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం ఆ నిందితులంతా పరారీలో ఉన్నట్లు సమాచారం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications