సిద్ధూ దూకుడుకు హై కమాండ్ చెక్.. సీఎం అభ్యర్థిని ప్రకటించొద్దంటూ ఆదేశం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న ఆయన దూకుడుకు చెక్ పెట్టింది. ఇప్పడే పంజాబ్‌లో సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించరాదని రాష్ట్ర శాఖకు హైకమాండ్ ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమిష్టి పనిచేసి మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

సీఎం అభ్యర్థిని ప్రకటించొద్దు..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పుకుంటున్నారు. అయితే ఆయన ప్రచారానికి అధిష్టానం నుంచి గట్టి షాక్ తగిలింది. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించరాదని తేల్చి చెప్పింది. పంజాబ్‌లో వివిధ వర్గాల మధ్య సమతూకం పాటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించింది. దీనిని దృష్టిలో ఉంచుకోని సీఎం అభ్యర్థిని ప్రకటించకూడదని హైకమాండ్ నిర్ణయించింది.

సిద్ధూపై సీనియర్‌లు గుర్రు..
అటు చరణ్ జిత్ సింగ్ జన్నీని సీఎంగా అధిష్టానం ప్రమోట్ చేయడం సిద్ధూకి రుచించడం లేదు. అందుకే ఇప్పటి నుంచే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థి అవుతానని భావిస్తున్నారు. పలు సభల్లో తనకు తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సిద్ధూ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. సమిష్టిగా ఎన్నికల్లో పోరాడేందుకు ఇది అవరోధంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పేర్లను నవజ్యోత్ సింగ్ సిద్ధూయే స్వయంగా ప్రకటిస్తున్నారని మండిపడుతున్నారు . ఏక పక్షంగా టికెట్లను కేటాయిస్తుంటే ఇక ఎన్నికల కమిటీలు ఎందుకంటూ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పరువునష్టం నోటీసులు..
మరోవైపు పోలీసులపై సిద్ధూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు కూడా తడిసిపోయేలా చేయగలరని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులపై తప్పుడు పదజాలాన్ని వాడటం దురదృష్టకరమని మండిపడున్నారు. అటు పోలీసులు కూడా సిద్ధూ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సిద్దూ కుటుంబాన్ని రక్షిస్తున్నది కూడా పోలీసులేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరువునష్టం నోటీసులు పంపించినట్టు తెలిపారు పోలీసులు
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications