College gilr: ఆర్ టీసీ బస్సులో ఆరాచకం, కాలేజ్ అమ్మాయి చిక్కిందని కండెక్టర్, డ్రైవర్ ?, దూకేసింది !

చెన్నై/ విల్లుపురం: కాలేజ్ లో చదువుతున్న యువతి ప్రతిరోజూ ఇంటి నుంచి ఆర్ టీసీ బస్సులో కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఉదయం ఆర్ టీసీ బస్సులో కాలేజ్ కు వెళ్లే యవతి కాలేజ్ పూర్తి అయిన తరువాత ఊరికి వెళ్లే ఆర్ టీసీ బస్సులోనే ఇంటికి వెలుతోంది. ఎప్పటిలాగే సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తరువాత బస్ స్టాండ్ కు వెళ్లింది. బస్సు మిస్ అయిపోవడంతో తరువాత బయలుదేరిన బస్సులో ఆమె ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలోని గ్రామాల్లో ప్రయాణికులు అందరూ దిగిపోయారు. ఆర్ టీసీ బస్సులో కాలేజ్ అమ్మాయి మాత్రమే ఉంది. అదే బస్సులో ఉన్న కండెక్టర్, డ్రైవర్ ఆమె మీద కన్ను వేశారు, బస్సు వేగంగా వెలుతున్న సమయంలో కండెక్టర్ ఆమె మీద లైంగిక దాడి చేసి ఆమెను శారీరంగా చిత్రహింసలకు గురి చేశాడు. బస్సు నిర్జనప్రదేశంలో నిలిపివేసిన డ్రైవర్ కూడా ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత బస్సు వేగంగా నడిపాడు. ఊరు దాటిపోయినా బస్సు నిలపకపోవడంతో కాలేజ్ అమ్మాయి బస్సులో నుంచి కిందకు దూకేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్ టీసీ బస్సు కండెక్టర్ ను అరెస్టు చేసి ఆ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని నరాలు నిలువునా లాగేస్తున్నారు.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని విల్లుపురం సమీపంలోని కోనూరు గ్రామంలో 20 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఈ అమ్మాయి డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న యువతి ప్రతిరోజూ కోనూరులోని ఇంటి నుంచి ఆర్ టీసీ బస్సులో చెన్నైలో ఉన్న కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఉదయం ఆర్ టీసీ బస్సులోనే కోనూరు నుంచి చెన్నైలోని కాలేజ్ కు వెళ్లే యవతి కాలేజ్ పూర్తి అయిన తరువాత చెన్నై నుంచి తిరిగి సొంత ఊరికి వెళ్లే ఆర్ టీసీ బస్సులోనే ఇంటికి వెలుతోంది.

బస్ మిస్ అయిపోయింది

బస్ మిస్ అయిపోయింది

గురువారం ఉదయం ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లింది. సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయి బస్ స్టాండ్ కు బయలుదేరింది. అయితే ప్రతిరోజు ఆ అమ్మాయి ప్రయాణించే బస్సు అప్పటికే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయిందని సమాచారం. బస్సు మిస్ అయిపోవడంతో తరువాత రాత్రి 7.30 గంటలకు బయలుదేరిన బస్సులో కాలేజ్ అమ్మాయి కోనూరులోని ఇంటికి బయలుదేరింది.

బస్సులో అమ్మాయి ఒక్కటే మిగిలింది

బస్సులో అమ్మాయి ఒక్కటే మిగిలింది

మార్గం మద్యలోని గ్రామాల్లో ప్రయాణికులు అందరూ దిగిపోయారు. ఆర్ టీసీ బస్సులో కాలేజ్ అమ్మాయి మాత్రమే ఉంది. అదే బస్సులో ఉన్న కండెక్టర్ సిలంబరసన్ , డ్రైవర్ అన్బుసెల్వన్ ఆమె మీద కన్ను వేశారు, బస్సు కదులుతున్న సమయంలో కండెక్టర్ సిలంబరసన్ కాలేజ్ అమ్మాయి పక్కన కుర్చుని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు.

బస్సులో విరుచుకుపడిన కండెక్టర్, డ్రైవర్

బస్సులో విరుచుకుపడిన కండెక్టర్, డ్రైవర్


బస్సు వేగంగా వెలుతున్న సమయంలో కండెక్టర్ సిలంబరసన్ ఆమె మీద లైంగిక దాడి చేసి ఆమెను శారీరంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఊరు వచ్చే వరకు నువ్వు సైలెంట్ గా కామాంధులకు చిక్కకుండా ఉండాలని, ఇక్కడ మేము వాళ్ల కథ చూసుకుంటామని చెప్పారు. బస్సు నిర్జనప్రదేశంలో నిలిపివేసిన డ్రైవర్ అన్బుసెల్వన్ కూడా ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.

 బస్సులో నుంచి దూకేసిన కాలేజ్ అమ్మాయి

బస్సులో నుంచి దూకేసిన కాలేజ్ అమ్మాయి

తరువాత డ్రైవర్ అన్బుసెల్వన్ కోనూరులో బస్సు నిలపకుండా ముందుకు వాహనాన్ని వేగంగా నడిపాడు. కోనూరు ఊరు దాటిపోయినా బస్సు నిలపకపోవడంతో భయంతో కాలేజ్ అమ్మాయి బస్సులో నుంచి కిందకు దూకేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్ టీసీ బస్సు కండెక్టర్ సిలంబరస్ ను అరెస్టు చేసి ఆ బస్సు డ్రైవర్ అన్బుసెల్వన్ ను అదుపులోకి తీసుకుని నరాలు నిలువునా లాగేస్తున్నారు. బస్సు కండెక్టర్, డ్రైవర్ తో పాటు మొత్తం నలుగురి మీద కేసు నమోదు చేసిన విల్లుపురం పోలీసులు అందర్ని విచారణ చేస్తున్నారని తెలిసింది. చాలా కాలంగా కాలేజ్ అమ్మాయి మీద కండెక్టర్ సిలంబరస్ కన్ను పడిందని తెలిసింది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి ఇప్పటికే కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, భర్త అనుమతితో ఆమె కాలేజ్ లో డిగ్రీ పూర్తి చెయ్యడానికి రోజూ సొంత ఊరి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. బస్సులో కాలేజ్ అమ్మాయి ఒంటరిగా వెలుతోందని ఆమె ఊరుకంటే ముందు స్టాప్ లో దిగిన వ్యక్తి చూశాడని, అయినా అతను ఆమె కుటుంబ సభ్యులకు సమాాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. వేగంగా కదులుతున్న తమిళనాడు ప్రభుత్వ బస్సులో కాలేజ్ విద్యార్థి మీద అదే బస్సు కండెక్టర్, డ్రైవర్ లైంగిక దాడి చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+