LPG Cylinder Price: శుభవార్త..! రూ.158 తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..
ఎల్పీజీ సిలిండర్ ధర రూ.158 తగ్గింది. మొన్న రూ.200, ఇప్పుడు మరో రూ.158 తగ్గందని సంబరపడిపోకండి. ఎందుకంటే ఇప్పుడు తగ్గింది గృహవినియోగ సిలిండర్ల ధర కాదు కామర్షియల్ సిలిండర్ల ధర తగ్గింది. దేశీయ LPG ధరలను తగ్గించిన తర్వాత, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ. 158 తగ్గించాయి. ఢిల్లీలో, వాణిజ్య సిలిండర్ రూ. 158 తగ్గించిన తర్వాత ఇప్పుడు రూ. 1522.50 గా చేరింది. ఈ రేట్లు ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుంచి వర్తిస్తాయి. ఇది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కోట్టుల వారికి ఈ శుభవార్త అని చెప్పాలి
అంతకుముందు, రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్‌పిజి ధరను రూ.200 తగ్గించింది. మూడు రోజుల క్రితం రాఖీ పండుగ సందర్భంగా కేంద్ర కేబినెట్ డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 200 తగ్గించింది. అంతే కాదు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింది గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి అదనంగా మరో రూ.200 రాయితీ ఇచ్చింది. దీంతో ఉజ్యల యోజన కింద రూ. 400 రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో 14.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండేవి.

అవి ఇప్పుడు 33 కోట్లకు పెరిగాయి. ఈ 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో 9.6 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే రోజుల్లో 75 లక్షల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఉజ్వల పథకం కింద మహిళలు ఉచితంగా గ్యాస్ స్టవ్, సిలిండర్ బుడ్డి, పైపు ఉచితంగా అందిస్తారు. గతంలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1155 ఉండగా.. తగ్గిన ధరతో సిలిండర్ ధర రూ.955కు చేరింది. హైదరాబాద్ వంట గ్యాసి సిలిండర్ ధర రూ.955 లగా ఉంది.
కోల్ కత్తాలో రూ.929, చెన్నైలో రూ.908, బెంగళూరులో రూ.905 గా ఉంది. కొన్ని రాష్ట్రాలు కేంద్రం అందిస్తున్న రాయితీతో పాటు రాష్ట్ర రాయితీ కూడా అందిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సావన్ నెలలో గృహ గ్యాస్ సిలిండర్‌ను రూ. 450 చొప్పున అందిస్తామని చెప్పారు. రాయితీ మొత్తం DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా బదిలీ చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications