Conductor: ముగ్గురు భార్యలు, ఆంటీతో అక్రమ సంబంధం, ఆంటీ కూతురితో నాలుగో పెళ్లి, డౌట్ రాదని !

బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో మూడో పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు పిల్లలు పట్టలేదు. ఇదే సమయంలో వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ముగ్గురు భార్యలతో పాటు ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కమాంధుడు ఆమె కూతురి మీద కన్ను వేశాడు. ప్రియుడికి కన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తన అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని, పనిలో పనిగా అన్ని జరిగిపోతాయని ఆంటీ స్కెచ్ వేసింది. ఆంటీ కూతురిని నాలుగో పెళ్లి చేసుకున్న కండెక్టర్ ఆమెను గర్బవతిని చేశాడు. అమ్మాయి అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మైనర్ గర్బవతి అని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆర్ టీసీ బస్సు కండెక్టర్ అసలు కథ మొదలైయ్యింది.

 ఆర్ టీసీ కండెక్టర్

ఆర్ టీసీ కండెక్టర్

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని జయకొండ సమీపంలోని పెరియకరుక్కై ప్రాంతంలో రాధాక్రిష్ణన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలో రాధాక్రిష్ణన్ కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాధాక్రిష్ణన్ అనేక మంది అమ్మాయిలను చూసినా అంత త్వరగా అతనికి వివాహం చేసుకోవడానికి పెళ్లి కూతురు సెట్ కాలేదు.

పెళ్లి చేసుకోవాలని ఆశపడిన కండెక్టర్

పెళ్లి చేసుకోవాలని ఆశపడిన కండెక్టర్

ప్రభుత్వ రవాణా సంస్థలో కండెక్టరట్ గా ఉద్యోగం చేస్తున్న రాధాక్రిష్ణన్ వివాహం చేసుకోవడానికి రెండు సంవత్సరాల పాటు అనేక మంది యువతులను చూశాడు. చివరికి రాధాక్రిష్ణన్ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో రాధాక్రిష్ణన్ మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. రెండు పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు

రెండో పెళ్లి చేసుకున్న రాధాక్రిష్ణన్ కు చేదు అనుభవం ఎదురైయ్యింది. రెండో భార్యకు కూడా పిల్లలు పుట్టలేదు. కొంతకాలానికి మొదటి భార్య, రెండో భార్య అనుమతితో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు పిల్లలు పుట్టకపోవడంతో రాధాక్రిష్ణన్ షాక్ అయ్యాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, ముగ్గురు భార్యలు ఉన్నా నీకు పిల్లలు పట్టలేదని బంధువులు, స్నేహితులు రాధాక్రిష్ణన్ ను ఎగతాలి చెయ్యడం మొదలు పెట్టారని తెలిసింది.

 ఆంటీతో అక్రమ సంబంధం

ఆంటీతో అక్రమ సంబంధం

కడలూరు జిల్లాలో నివాసం ఉంటున్న పరమేశ్వరి అనే వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాధాక్రిష్ణన్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ముగ్గురు భార్యలతో పాటు ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కమాంధుడు రాధాక్రిష్ణన్ పరమేశ్వరి కూతురు (13) ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశాడు. ఆంటీ ఇంటికి వెలుతున్న రాధాక్రిష్ణన్ ఆమె కూతురితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

 ప్రియుడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన ఆంటీ

ప్రియుడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన ఆంటీ

ప్రియుడు రాధాక్రిష్ణన్ కు తన కన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తన అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని, పనిలో పనిగా అన్ని జరిగిపోతాయని పరమేశ్వరి ఆంటీ స్కెచ్ వేసింది. రాధాక్రిష్ణన్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆ అమ్మాయి తల్లి పరమేశ్వరికి చెప్పింది. పరమేశ్వరి ఆంటీ ఆమె కూతుర్ని బలవంతంగా రాధాక్రిష్ణన్ కు ఇచ్చి నాలుగో పెళ్లి చేసేసింది.

 బలవంతంగా కాపురం చేసి గర్బవతిని చేసిన కండెక్టర్

బలవంతంగా కాపురం చేసి గర్బవతిని చేసిన కండెక్టర్

పరమేశ్వరి ఆంటీ కూతురిని నాలుగో పెళ్లి చేసుకున్న కండెక్టర్ రాధాక్రిష్ణన్ ఆమెతో బలవంతంగా కాపురం చేసి గర్బవతిని చేశాడు. అమ్మాయి అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మైనర్ గర్బవతి అని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది అరియలూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది

మైనర్ ను పెళ్లి చేసుకుని ఆమెతో బలవంతంగా కాపురం చేసి ఐదు నెలల గర్బవతిని చేసిన తమిళనాడు ఆర్ టీసీ బస్సు కండెక్టర్ రాధాక్రిష్ణన్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాధాక్రిష్ణన్ ను విధుల నుంచి తప్పించామని తమిళనాడు రవాణా శాఖా అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+