Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిలిచి ఎంపీ టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ డీసీఎంకు సెగపెట్టిన లీడర్, వందల కోట్ల యవ్యారం !

కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ముద్దహనుమేగౌడ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తుమకూరు జిల్లాలో లింక్ కెనాల్ ద్వారా హేమావతి నీటిని కుణిగల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్టుపై తుమకూరు లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ముద్దహనుమేగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతంలో తుమకూరు జిల్లా కుణిగల్, తుమకూరుకు నీళ్లు ఇవ్వాలనే నెపంతో రామనగర జిల్లాకు నీళ్లిచ్చే యోచనలో ఉన్నారని, అలాంటి ప్రయత్నాలు జరిగిన సమయంలో తుమకూరు జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్నా డీసీఎం డీకే శివకుమార్ రూ. 910 కోట్లతో లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బెంగళూరు రూరల్‌లో లింక్ కెనాల్ (ఎక్స్‌ప్రెస్ కెనాల్) ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ బెంగళూరు గ్రామీణ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తోంది.

Congress leaders are opposing the canal works that DK Shivakumar is ambitiously trying to build
స్టార్ హీరో కేసులో నిర్మాతలకు షాక్, విచారణ చెయ్యాలని చెప్పిన హైకోర్టు, హీరోను నీచంగా !

ఎక్స్ ప్రెస్ లింక్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదని తుమకూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో డీకే శివకుమార్ వర్గీయులు హడలిపోయారుతుమకూరులో మీడియా సమవేశంలో ముద్దహనుమేగౌడ్ మాట్లాడుతూ లింక్ కెనాల్ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా కుణిగల్‌కు నీరు వెళ్లేలా చూడాలని, ఎక్స్‌ప్రెస్ కెనాల్‌ను ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని ముద్దహనుమేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎక్స్ ప్రెస్ కెనాల్ ను విడిగా చేయడం వల్ల తుమకూరు జిల్లాలోని ఇతర తాలూకాలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న ఛానెల్‌ని విస్తరించనివ్వండి. మన జిల్లా ప్రయోజనాల దృష్ట్యా ఎక్స్ ప్రెస్ ప్రెస్ కెనాల్ ను వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఎక్స్‌ప్రెస్ కెనాల్ ద్వారా ఒక తాలూకాకు నీటిని మళ్లిస్తే, అందరూ అదే పని చేయడం ప్రారంభిస్తారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా తాను ఈ కెనాల్ నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తం చేశానని ముద్దహనుమేగౌడ అన్నారు.

Congress leaders are opposing the canal works that DK Shivakumar is ambitiously trying to build

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆలయాలు తిరుగుతున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ ఆలయానికి వెళ్లి మహాబలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహాబలేశ్వరుడికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.

డీసీఎం డీకే శివకుమార్‌ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన సన్నిహితులు దేవాలయాలకు వెళ్లారు.డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పాన్ని గోకర్ణ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ హవా లేదని, రాముడి హవా అంతకంటే లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ గ్యారెంటీకి బదులు మోదీ గ్యారెంటీలు అంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+