వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీకి మళ్ళీ కరోనా పాజిటివ్; కాంగ్రెస్ లో కరోనా కల్లోలం; ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. జూన్ ప్రారంభంలో ఆమె కరోనావైరస్ మహమ్మారి కోసం పాజిటివ్ పరీక్షించిన నెల తర్వాత ఇప్పుడు మరోమారు సోనియాగాంధీ కరోనా మహమ్మారి బారిన పడటం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది.

Recommended Video

కరోనా భారిన సోనియా - Get Well Soon

మాస్కులు పెట్టుకోవటం మరచిపోయిన జనం.. కరోనా విజృంభిస్తున్నా లేని భయం!!మాస్కులు పెట్టుకోవటం మరచిపోయిన జనం.. కరోనా విజృంభిస్తున్నా లేని భయం!!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించారు. కరోనా నిబంధనల మేరకు ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నారని జై రామ్ రమేష్ ట్వీట్ ద్వారా తెలిపారు. బుధవారం, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా మూడు నెలల్లో రెండవ సారి కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించినట్లు ప్రకటించారు.

 జూన్ లో కరోనా బారిన పడిన సోనియా.. మళ్ళీ కరోనా ఆందోళన

జూన్ లో కరోనా బారిన పడిన సోనియా.. మళ్ళీ కరోనా ఆందోళన


ఇక అంతకు ముందు జూన్ మొదటి వారంలో సోనియాగాంధీ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. అప్పుడు కరోనా కారణంగా ఆ సమయంలో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఆ తరువాత కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నాక ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరయ్యారు. అయితే కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని నెల రోజులు కూడా కాకముందే మరోమారు ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన ఎఫెక్ట్ .. కరోనా బారిన పడుతున్న కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన ఎఫెక్ట్ .. కరోనా బారిన పడుతున్న కాంగ్రెస్ నేతలు


ఇదిలా ఉంటే ఇటీవల సోనియాగాంధీని ఈడీ విచారణ నేపథ్యంలో సోనియాగాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇక ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఇక ఈ ఆందోళన తర్వాత ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు.

సోనియాగాంధీతో పాటు కరోనా బారిన పడిన వాళ్ళు వీళ్ళే

సోనియాగాంధీతో పాటు కరోనా బారిన పడిన వాళ్ళు వీళ్ళే


ప్రస్తుతం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింఘ్వి, ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇదిలా ఉంటే శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 16,000 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 68 మరణాలు నమోదయ్యాయి.

English summary
congress president Sonia Gandhi was diagnosed as Corona positive again. She got infected with Corona in June itself, but within a few days she tested Corona positive again. Corona tension in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X