జహంగీర్‌పురిలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కొనసాగిన కూల్చివేతలు; అధికారులు చెప్పిందిదే!!

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా మత ఘర్షణలు జరిగిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఆ ప్రాంతంలో ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్‌ కొనసాగించారు మున్సిపల్ అధికారులు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ ను ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ బుల్డోజర్లు నిర్మాణాలను ధ్వంసం చేయడం కొనసాగించాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం కోర్టు స్టే .. అయినా కొనసాగిన కూల్చివేతలు

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం కోర్టు స్టే .. అయినా కొనసాగిన కూల్చివేతలు

శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన మత ఘర్షణ తర్వాత ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌పై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. దీనిపై రేపు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా బుల్‌డోజర్లు దుకాణాలు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేస్తూనే ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై మాట్లాడిన అధికారులు తమకు ఇంకా ఆర్డర్ అందలేదని, అది వచ్చిన తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఢిల్లీ బీజేపీ చీఫ్ లేఖ తర్వాత పరిణామాలతో టెన్షన్

ఢిల్లీ బీజేపీ చీఫ్ లేఖ తర్వాత పరిణామాలతో టెన్షన్

ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మేయర్‌కు లేఖ రాసిన తర్వాత, హనుమాన్ జయంతి అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి, వారి అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చివేయాలని కోరడంతో ఆక్రమణ నిరోధక చర్యకు మేయర్ ఆదేశించారు. మేయర్ దీనిని ఎప్పటికీ జరిగే ప్రక్రియగా పేర్కొన్నప్పటికీ, హనుమాన్ జయంతి ఊరేగింపు అల్లర్లు, ఆర్డర్ యొక్క సమయం, ముఖ్యంగా బిజెపి లేఖ తర్వాత ఈ ఆక్రమణల కూల్చివేత చోటు చేసుకుంది. ఇది రాజకీయ దురుద్దేశానికి సంబంధించిన ప్రశ్నలను ప్రేరేపించింది.

ఆర్డర్ కాపీ అందలేదు.. అందితే కూల్చివేతలు నిలిపివేస్తామన్న అధికారులు

ఆర్డర్ కాపీ అందలేదు.. అందితే కూల్చివేతలు నిలిపివేస్తామన్న అధికారులు

తొలగింపు డ్రైవ్‌కు ముందు, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేపేంద్ర పాఠక్ మరియు ఇతర సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు రోజుల ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ కోసం నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిన్న కనీసం 400 మంది పోలీసు సిబ్బందిని భద్రత కల్పించాలని కోరారు. ఇక కూల్చివేతలకు పాల్పడుతున్న క్రమంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ అందని కారణంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నామని, కాపీ అందిన వెంటనే ఆపేస్తామని చెప్పారు అధికారులు.

 హనుమాన్ జయంతి ఊరేగింపు నాడు ఘర్షణ.. తొమ్మిది మందికి గాయాలు, 25 మంది అరెస్ట్

హనుమాన్ జయంతి ఊరేగింపు నాడు ఘర్షణ.. తొమ్మిది మందికి గాయాలు, 25 మంది అరెస్ట్

అనుమతి లేని హనుమాన్ జయంతి ఊరేగింపు మసీదు వెంబడి వెళ్లినప్పుడు శనివారం జరిగిన మత ఘర్షణల నుండి జహంగీర్‌పురిలో పోలీసులు నిఘా ఉంచారు. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతోపాటు కాల్పులు జరుపుకున్న హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది పోలీసులతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇక తాజా పరిణామాలతో మరోమారు జహంగీర్‌పురిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+