భారత్ లో తాజాగా 43,654 కొత్త కేసులు, 640 మరణాలు.. ఆ రెండు రాష్ట్రాల్లోనే 50శాతం కేసులు

నిన్నటితో పోలిస్తే భారత దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 43,654 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు నమోదైన కేసులు 47 శాతం ఎక్కువ. నిన్నటికి నిన్న నాలుగు నెలల్లో మొదటిసారిగా రోజువారీ కేసులు 30,000 కన్నా తక్కువకు పడిపోయాయి. మళ్లీ ఒకే రోజులో విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉంది.

పెరిగిన మరణాలు ... గత 24 గంటల్లో 640 మరణాలు

పెరిగిన మరణాలు ... గత 24 గంటల్లో 640 మరణాలు

కరోనా మహమ్మారి కారణంగా భారత్ లో 640 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన భారతదేశ ప్రజల సంఖ్య 4.22 లక్షలకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో నిన్న ఒక్కరోజే 41 ,678 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీలు 3.06 కోట్లకు చేరుకున్నాయి. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,99 , 439 క్రియాశీల కేసులు భారత దేశంలో ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 1.27 శాతంగా ఉంది.

కేరళ, మహారాష్ట్రలలో 50 శాతం వరకు కేసులు

కేరళ, మహారాష్ట్రలలో 50 శాతం వరకు కేసులు

ఇదిలా ఉంటే భారతదేశంలో నిన్న ఒక రోజు 40,02,358 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 44,61,56,669 గా ఉంది. గత 24 గంటల్లో కేరళలో తాజాగా 22,129 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు ఇన్ఫెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించినప్పటికీ కేరళలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కేరళ మరియు మహారాష్ట్రల నుండి 50 శాతం వరకు కొత్త కేసులు వస్తున్నాయి.

కరోనాపై పదేపదే హెచ్చరిస్తున్న నిపుణులు

కరోనాపై పదేపదే హెచ్చరిస్తున్న నిపుణులు

మహారాష్ట్రలో తాజా కోవిడ్ కేసులు 6,258 కాగా, కర్ణాటకలో 1,501, తమిళనాడులో 1,767 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపెట్టి పోలేదని, మనం అలిసిపోయినా కరోనా వైరస్ అలసి పోదని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ కె ఏ పాల్ స్పష్టం చేశారు. టీకాలు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డాక్టర్ వి.కె పాల్ ఏ వ్యాక్సిన్‌కు 100 శాతం హామీ లేదు, అన్ని వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రత ను మాత్రమే తగ్గిస్తాయని, మరణాన్ని నివారిస్తాయని వెల్లడించారు.

Recommended Video

    Covid-19 Vaccines For Kids Likely By September - Dr Randeep Guleria | Oneindia Telugu
    త్వరలో చిన్నారులకు వ్యాక్సినేషన్ .. ప్రపంచ వ్యాప్తంగా 19.53 కోట్ల కోవిడ్ కేసులు

    త్వరలో చిన్నారులకు వ్యాక్సినేషన్ .. ప్రపంచ వ్యాప్తంగా 19.53 కోట్ల కోవిడ్ కేసులు

    కరోనా సోకటం మాత్రం తగ్గించలేవని స్పష్టం చేశారు. అందుకే అప్రమత్తంగా ఉండాలన్నారు. కొద్దిరోజుల్లో భారత్‌ లో చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటులో బిజెపి ఎంపీల సమావేశంలో చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటివరకు 19.53 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి . 41 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం 3.14 కోట్ల కేసులు, అమెరికాలోనూ 3.14 కోట్ల కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+