వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా వ్యాప్తి: మళ్ళీ నిబంధనల దిశగా రాష్ట్రాలు; తాజా పరిస్థితి ఇదే!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. గత కొద్ది రోజులుగా నిత్యం 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తీరుతో దేశానికి మళ్ళీ కరోనా భయం పట్టుకుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 2,483 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి . అంతకుముందు రోజు 2,541 కేసుల కంటే కొంచెం తక్కువగా నమోదయ్యాయి. క్రియాశీల కేసులు కూడా 16,522 నుండి 15,636కి తగ్గాయి. అయితే పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉంది.

దేశంలో 1,399 కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయి. వీరిలో 1,347 మంది ఇతర కారణాల వల్ల మరణించిన కోవిడ్-పాజిటివ్ రోగుల సంఖ్యను ప్రతిబింబించేలా అస్సాం నుండి నివేదించబడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం, కర్ణాటక మరియు ఛత్తీస్‌గఢ్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేసింది. ఇదిలా ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించేలా చూడాలని, టీకా కవరేజీని పెంచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

Corona cases rise in India: States Again Towards Rules; This is the latest situation !!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అక్కడ కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో సోమవారం 1,011 తాజా కోవిడ్ -19 కేసులు మరియు ఒక మరణాన్ని నివేదించగా, పాజిటివిటీ రేటు 6.42 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ కేసులు ఆదివారం సంఖ్య కంటే కొంచెం తక్కువగా ఉండగా, రాజధానిలో నేడు 1,083 తాజా కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.48 శాతం నుండి పెరిగింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఏప్రిల్ 10 న బూస్టర్ డోస్ తీసుకోవాలని వ్యాక్సిన్లు విడుదల చేసినప్పటి నుండి 18-59 సంవత్సరాల వయస్సు గల వారు కేవలం 3.87 లక్షల మంది మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ యొక్క "ముందు జాగ్రత్త" మూడవ డోస్‌ను తీసుకున్నారు. కానీ గణనీయంగా, ఈ డోస్‌లలో 51 శాతానికి పైగా గత నాలుగు రోజులలో అందించబడ్డాయి. కేసుల పెరుగుదల మరియు ఢిల్లీ వంటి కీలక నగరాల్లో మాస్క్ లను తప్పనిసరి చెయ్యటంతో ప్రజల్లోనూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న భావన పెరుగుతుంది.

English summary
In the last 24 hours, 2,483 new Covid-19 cases were reported in India. The day before, slightly less than 2,541 cases had been reported. Active cases also dropped from 16,522 to 15,636. The positivity rate, however, was 0.55 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X