వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో కరోనా విలయం: 2.38లక్షలకు పైగా కొత్త కేసులు, భారీగా పెరుగుతున్న క్రియాశీల కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో 2,38,018 మంది కరోనా బారిన పడ్డట్టుగా తెలుస్తుంది.ఈ లెక్క నిన్నటి కంటే 20,071 తక్కువ అని సమాచారం.దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 37.62 మిలియన్లకు చేరుకుంది.

కరోనా కారణంగా 310 మరణాలు, 17లక్షలకు పైగా క్రియాశీల కేసులు

కరోనా కారణంగా 310 మరణాలు, 17లక్షలకు పైగా క్రియాశీల కేసులు

గత 24 గంటల్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 310 మరణాలు నమోదు కాగా, గత 24 గంటల్లో 1,57,421 రికవరీలు నమోదయ్యాయి. 8,891 మొత్తం ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో నిన్నటితో పోలిస్తే 8.31% పెరుగుదల నమోదయింది. క్రియాశీల కేసులు 17,36,628కి పెరిగాయి. ఇది 230 రోజులలో అత్యధికం. కొత్త కేసులు పెరుగుదలతో క్రియాశీల కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి తో బాధపడుతున్న వారి క్రియాశీల రేటు 4.62 శాతంగా ఉంది.

రికవరీ రేటు 94.09 శాతం, 58.04 కోట్లను దాటిన వ్యాక్సినేషన్

రికవరీ రేటు 94.09 శాతం, 58.04 కోట్లను దాటిన వ్యాక్సినేషన్

మరణాల సంఖ్య 310 తాజా మరణాలతో కలిపి 4,86,761కి చేరుకుంది. గత 24 గంటల్లో 1,57,421 రికవరీలతో, మొత్తం కరోనా రికవరీలు 3,53,94,882కి పెరిగాయి. ఫలితంగా రికవరీ రేటు 94.09 శాతంగా ఉంది.గత 24 గంటల్లో దాదాపు 80 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చినట్టు సమాచారం. దీంతో భారతదేశం యొక్క మొత్తం కోవిడ్-19 టీకా కవరేజీ 158.04 కోట్లను దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

థర్డ్ వేవ్ నేపధ్యంలో బూస్టర్ డోసులు; పిల్లలకు వ్యాక్సిన్లపై కేంద్రం

థర్డ్ వేవ్ నేపధ్యంలో బూస్టర్ డోసులు; పిల్లలకు వ్యాక్సిన్లపై కేంద్రం

ఇదిలా ఉంటే తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో, థర్డ్ వేవ్ సంకేతంతో దేశంలో ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుతం వారికి కరోనా వ్యాక్సిన్ యొక్క బూస్టర్ డోసులను ఇస్తోంది. ఇక ఇదే సమయంలో దేశంలో 12 ఏళ్ల నుండి 14 ఏళ్ల పిల్లలకు మార్చి నుంచి టీకాలు పంపిణీ చేయనున్నట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు స్పందించాయి.

ఈ వయసు వారికి టీకాలు పంపిణీ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 15 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసు వరకు టీకాల పంపిణి ముగిసిన తర్వాత, 12 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు పిల్లలకు టీకాలు మొదలయ్యే సూచనలున్నాయని కరోనా టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోడా వెల్లడించారు.

ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న చాలా మంది ప్రజలు

ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న చాలా మంది ప్రజలు

కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండు ఒత్తిడితో కూడిన సంవత్సరాలను గడిపిన తరువాత, 10 మందిలో 7మంది (71 శాతం) నిపుణులు మహమ్మారి కంటే ఇప్పుడు పనిలో వారి సామర్థ్యాలను ప్రశ్నించగా, 63 శాతం మంది వారు 'ఇంపోస్టర్ సిండ్రోమ్'తో బాధపడుతున్నారని చెప్పారని తెలుస్తుంది. 'ఇంపోస్టర్ సిండ్రోమ్' అనేది ఒక వ్యక్తి తన నైపుణ్యాలు, ప్రతిభ లేదా విజయాలను అనుమానించే మానసిక నమూనా అని తెలుస్తుంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభానికి కారణంగా మారింది.

English summary
over 2.38 lakh new cases, nearly 9 thousand Omicron cases reported in india in lst 24 hours. active cases rose to 17,36,628 according to the Union health ministry data. 8,891 cases of Omicron variant have been reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X