వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో కరోనా కల్లోలం: వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో 200మందికి పైగా వైద్యసిబ్బందికి కరోనా

|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న తీరు రాష్ట్రంలో ఆందోళనకరంగా తయారైంది. తాజాగా వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (CMC) హాస్పిటల్‌లో 200 మందికి పైగా వైద్య సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందని కార్పొరేషన్ అధికారి తెలిపారు.

వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

ఆరోగ్య కార్యకర్తలు గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారని, ఆసుపత్రి యాజమాన్యం వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని వెల్లూర్ కార్పొరేషన్ సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ టి మణివన్నన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, అయితే వారంతా తేలికపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇక వీరి కోసం ప్రత్యేకమైన కోవిడ్ వార్డును ను ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు

వేలూరు ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు బంద్

వేలూరు ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు బంద్

ఆసుపత్రిలో 2,000 మంది వైద్యులు సహా 10,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా మరియు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుండి కూడా రోగులు సాధారణంగా చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి వస్తుంటారు. వేలూరు ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని వైద్య సేవలను నిలిపి వేశారు. సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. ఎమర్జెన్సీ కాని వైద్య చికిత్సలు, ఔట్ పేషెంట్ (OP) సందర్శనలు మరియు ఇతర అత్యవసర చికిత్సలు మరియు శస్త్రచికిత్సల కోసం ఆన్‌లైన్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని సమాచారం.

వేలూరు ఆస్పత్రిలో అత్యవసర సేవలు మాత్రమే

వేలూరు ఆస్పత్రిలో అత్యవసర సేవలు మాత్రమే

ప్రస్తుతం వేలూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. వేలూరు సిటీ మునిసిపల్ కార్పొరేషన్ (VCMC) శుక్రవారం సిఎంసి సమీపంలోని బాబూరావు వీధిని 'కంటైన్‌మెంట్ జోన్'గా ప్రకటించింది. అక్కడ ఆరుగురు సభ్యులకు వారి బంధువులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లు తమిళనాడులో 10,000 మార్కును దాటాయి. వీటిలో దాదాపు 46% చెన్నైలో నివేదించబడ్డాయి.

తమిళనాడులో 10,978 మందికి కరోనా పాజిటివ్

తమిళనాడులో 10,978 మందికి కరోనా పాజిటివ్


రాష్ట్రంలో మొత్తం తాజాగా 10,978 మంది వ్యక్తులు కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించగా, మొత్తం పాజిటివిటీ రేటు 7.9%కి పెరిగింది. కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రతిరోజూ దాదాపు 2,000 మంది ఆస్పత్రులలో చేరుతున్నారని, అయినా పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని, ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోతాయని ఆరోగ్య శాఖా మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ కరోనా ఆస్పత్రిలో 260 మంది ఇన్‌ పేషెంట్లు ఉన్నారు. లక్షణాలు లేని యువకులను ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తున్నారు. ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్‌కు సలహా ఇస్తున్నారు.

రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 40,260

రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 40,260

అయితే కరోనాతో పాటుగా ఇతర అనారోగ్యాలతో ఉన్న వృద్ధులను చేర్చుకుంటున్నారు.తమిళనాడు ఆస్పత్రులలో చికిత్స అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. మిగిలిన వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని మంత్రి చెప్తున్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో ముందుజాగ్రత్త చర్యల గురించి చర్చించడానికి ఒక సమావేశం జనవరి 10న నిర్వహించబడుతుంది. తమిళనాడులో రోజువారీ కోవిడ్ -19 కేసుల పెరుగుదల రాష్ట్రం యొక్క క్రియాశీల కేసుల సంఖ్యను 40,260కి చేర్చింది.

English summary
Corona cases rise continues in Tamil Nadu. More than 200 medical staff at the Christian Medical College in Vellore were recently infected with the corona. As a result, general medical services at the hospital were suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X