వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులు

|
Google Oneindia TeluguNews

దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కరోనా మహమ్మారి ప్రళయాన్ని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో నమోదైన కేసులను మించి కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో 15,166 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మూడు కరోనాసంబంధిత మరణాలతో ముంబై ఈ రోజు రోజువారీ కేసులలో 39 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

Recommended Video

Omicron: Third Wave దిశగా దేశం New Year 2022 ఆంక్ష‌ల వలయం | Oneindia Telugu

కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కేంద్రం కొత్త హోం ఐసోలేషన్ నిబంధనలుకరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కేంద్రం కొత్త హోం ఐసోలేషన్ నిబంధనలు

సెకండ్ వేవ్ లో గరిష్ట కేసులను మించి పెరిగిన కేసులు

సెకండ్ వేవ్ లో గరిష్ట కేసులను మించి పెరిగిన కేసులు

ఏప్రిల్ 4, 2021న రెండవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకున్న ముంబైలో ఒక రోజులో 11,163 కేసులు నమోదయ్యాయి. మహానగరంలో ఈరోజు 1,218 మంది కోవిడ్ రోగులు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 80 మంది ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నారు. ఇప్పటివరకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో నమోదైన మొత్తం కేసులు 8,33,628కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 61, 923 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 16,384 కు పెరిగింది.

 ముంబైలో 15 వేలకు పైగా తాజా కేసులు

ముంబైలో 15 వేలకు పైగా తాజా కేసులు

గత 24 గంటల్లో ముంబైలో 714 మంది రోగులు కరోనా బారి నుండి బయటపడ్డారు. దీంతో ముంబైలో కరోనా మహమ్మారి బారినుండి నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 7,52, 726 కు చేరుకుంది. రికవరీ రేటు 90 శాతం గా ఉంది. కరోనా సెకండ్ వేవ్ గరిష్టంగా ఉన్న సమయంలో ఏప్రిల్ 4వ తేదీన అత్యధికంగా 11,123 కేసులు నమోదు కాగా తాజాగా 15 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

 ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో పెరిగిన కేసులు ..కొత్త కేసుల్లో 87 శాతం లక్షణాలు లేనివి

ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో పెరిగిన కేసులు ..కొత్త కేసుల్లో 87 శాతం లక్షణాలు లేనివి

ఇక కొత్త కేసుల్లో 87 శాతం లక్షణాలు లేనివని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం 10,860 కేసులు నమోదయ్యాయి.కోవిడ్ యొక్క రెండవ తరంగం వల్ల అత్యంత దెబ్బతిన్న నగరాలలో ఒకటైన ముంబై, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన అత్యంత వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా కేసుల ఉప్పెనను చూస్తోందని తెలుస్తుంది. కేసుల పెరుగుదలను నిరోధించే ప్రయత్నంలో ముంబై ఇప్పటికే నియంత్రణలను తీసుకువచ్చింది.

నియంత్రణా చర్యలు చేపట్టిన ముంబై

నియంత్రణా చర్యలు చేపట్టిన ముంబై


బీచ్‌లు, బహిరంగ మైదానాలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో జనవరి 15 వరకు సాయంత్రం 5 నుండి ఉదయం 5 గంటల వరకు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపారు. అంతేకాదు జనవరి 15 వరకు అమల్లో ఉండే ఆర్డర్ ప్రకారం భారీ సమావేశాలు నిషేధించబడ్డాయి.

 కరోనా వార్డు స్థాయి వార్ రూమ్ ల ఏర్పాటు .. 24 వార్డులలో వార్‌రూమ్‌లు

కరోనా వార్డు స్థాయి వార్ రూమ్ ల ఏర్పాటు .. 24 వార్డులలో వార్‌రూమ్‌లు

తాజా కోవిడ్ వేవ్‌కు భయపడి, నగర పౌర సంస్థ బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పెరుగుతున్న కేసులను పరిష్కరించడానికి తన వార్డు-స్థాయి వార్ రూమ్‌లను తిరిగి మొదలు పెట్టింది. ఈ వార్‌రూమ్‌లు మొత్తం 24 వార్డులలో ఆసుపత్రిలో చేరడం, ఆక్సిజన్ మరియు మందుల అవసరాలు మరియు టీకాలు వేయడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. వార్ రూమ్‌లు కరోనా నిర్ధారణ పరీక్ష, ట్రేస్ అండ్ ట్రీట్ వ్యూహాన్ని అనుసరించేవని పేర్కొంది. ఇవి ఇళ్ల వద్ద ఒంటరిగా ఉన్న రోగులను కూడా ట్రాక్ చేస్తాయని వెల్లడించింది.

English summary
Mumbai recorded 15,166 new covid cases and 3 covid deaths. Corona paw in Mumbai beyond corona second wave maximum cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X